జూన్ 24న మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ టీజర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ‘భోళా శంకర్’. ఇటీవల భోళా మ్యూజిక్ మానియా మొదలైంది. సినిమాలో మొదటి పాట విడుదల చేయగా ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకుంది. చిరంజీవి లీక్ చేసిన సంగీత్ సాంగ్ విజువల్స్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేశాయి. సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి పోస్టర్ ఆడియన్స్, అభిమానుల్లో సినిమాపై హైప్ పెంచింది. ఇప్పుడు భోళా శంకర్ నుంచి మరో గిఫ్ట్ రెడీ అయ్యింది. 

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ టీజర్ జూన్ 24న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన చిరంజీవి కొత్త స్టైల్ సూపర్ వుంది. బ్లాక్ జీన్స్, బ్లాక్ టీ షర్ట్ మీద చెక్ షర్ట్ వేసిన మెగాస్టార్ సీరియస్ వాకింగ్ స్టైల్, ఆ లుక్ లో ఇంటెన్సిటీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. 

ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ యూట్యూబ్, ఆడియో ప్లాట్‌ఫార్మ్స్‌లో ట్రెండ్ అవ్వడమే కాదు, సినిమాపై అంచనాలు పెంచాయి. మెగాస్టార్ డ్యాన్స్, గ్రేస్ కి తగ్గట్టు మహతి స్వర సాగర్ ఎనర్జిటిక్ డ్యాన్స్ ట్యూన్ అందించారు. లిరికల్ వీడియోలో కొన్ని స్టెప్స్ చూపించినా, అవి వైరల్ అయ్యాయి. టీజర్ రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్, ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. 

అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నారు.

డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

భోళా శంకర్  ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష, ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షావర్ అలీ & తరుణ్ అరోరా

సాంకేతిక విభాగం :
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ
పీఆర్వో: వంశీ-శేఖర్
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సిఎం
లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్

Tfja Team

Recent Posts

యంగ్‌ టీమ్‌ ఎనర్జీతో రూపొందించిన ‘శ్రీ చిదంబరం గారు’ బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను: లెజెండరీ మ్యూజిక్‌ డెరెక్టర్‌ ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…

6 hours ago

అంగరంగ వైభవంగా “సుమతీ శతకం” ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ – టికెట్ ధర కేవలం 100,150 మాత్రమే

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…

6 hours ago

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ “కిల్లర్” నుంచి పవర్ ఫుల్ విలన్ మనీష్ గిలాడ క్యారెక్టర్ లుక్ రిలీజ్

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…

6 hours ago

ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “స్కై”

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…

6 hours ago

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ భేటీ: ‘పద్మశ్రీ’ వచ్చినందుకు ఘన సత్కారం

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…

1 day ago