‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 7న హైద‌రాబాద్‌లో!

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. జులై 7న భార‌తీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది.
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇప్పటికే విడుద‌లైన పాట‌లు, ఇండియ‌న్ 2 ఇంట్రో గ్లింప్స్‌, ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి.

భార‌తీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 7న హైద‌రాబాద్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. జులై 7న సాయంత్రం ఆరు గంట‌ల నుంచి ఎన్ క‌న్వెన్ష‌న్‌లో భార‌తీయుడు 2 వేడుక జ‌ర‌గ‌నుంది.

28 ఏళ్ల ముందు భారతీయుడు చిత్రంతో బాక్సాఫీస్ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన క‌మ‌ల్ హాసన్‌, శంక‌ర్ కాంబోలో వ‌స్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంద‌రిలోనూ ఆస‌క్తి పెరిగిపోతుంది. ఈ త‌రుణంలో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌డానికి న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు భాగ్య‌న‌గ‌రంలో భారీ వేడుక‌ను ఏర్పాటు చేస్తున్నారు.
సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారోనంటూ అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు స‌హా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందించగా, ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేశారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందించారు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ రూపొందిస్తోన్న భారీ బ‌డ్జెట్‌తో ‘భార‌తీయుడు 2’లో క్రియేటివ్ బ్రిలియ‌న్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇది సినిమా ప్ర‌పంచంలో ఓ స‌రికొత్త మైలురాయిని క్రియేట్ చేయ‌టానికి సిద్ధంగా ఉంది. సినిమా చూసే ప్రేక్ష‌కుల్లో గొప్ప ఆలోచ‌న రేకెత్తించేలా సినిమాలు చేస్తూ త‌న అభిరుచి చాటుకుంటున్న లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ జూలై 12న‌ ఇండియన్ 2 పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లో సంద‌డి చేస్తున్నాయి.

న‌టీన‌టులు:

క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.శంక‌ర్‌, స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌, మ్యూజిక్ : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌, ఎడిటింగ్: ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ: ర‌వివ‌ర్మ‌న్‌, ఆర్ట్‌: ముత్తురాజ్‌, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, అన్బ‌రివు, రంజాన్ బుల‌ట్‌, పీట‌ర్ హెయిన్స్‌, స్టంట్ సిల్వ‌, డైలాగ్ రైట‌ర్‌: హ‌నుమాన్ చౌద‌రి, వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌: వి.శ్రీనివాస్ మోహ‌న్‌, కొరియోగ్ర‌ఫీ: బాస్కో సీజ‌ర్‌, బాబా భాస్క‌ర్‌, పాట‌లు: శ్రీమ‌ణి, సౌండ్ డిజైన‌ర్‌: కునాల్ రాజ‌న్‌, మేక‌ప్ : లెగ‌సీ ఎఫెక్ట్‌-వాన్స్ హర్ట్‌వెల్‌- ప‌ట్ట‌ణం ర‌షీద్‌, కాస్టూమ్ డిజైన్‌: రాకీ-గ‌విన్ మ్యూగైల్‌- అమృతా రామ్‌-ఎస్‌బి స‌తీష‌న్‌-ప‌ల్లవి సింగ్-వి.సాయి, ప‌బ్లిసిటీ డిజైన‌ర్: క‌బిల‌న్ చెల్ల‌య్య ,పి.ఆర్‌.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సుంద‌ర్ రాజ్‌, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌: జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, రెడ్ జైంట్ మూవీస్‌: సెన్‌బ‌గ మూర్తి, నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

కంప్లీట్ ఎంటర్ టైనర్ “క్రేజీ కల్యాణం” మూవీ నుంచి బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న…

11 minutes ago

‘హే బల్‌వంత్‌’ సినిమాతో నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ రాబోతుందనే నమ్మకం ఉంది: కథానాయకుడు సుహాస్‌

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

18 minutes ago

అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ద్వారా గ్లోబల్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతోన్న ‘రాకాస’.. ఓవర్సీస్‌లో 350కి పైగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల

అథర్వణ భద్రకాళి పిక్చర్స్ అధికారికంగా ‘రాకాస’ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను పొందింది. ‘రాకాసా’ వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ మీద ముద్రను…

3 days ago

హే భగవాన్‌ నవ్విస్తుంది.. హృదయానికి హత్తుకుంటుంది: సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ వంశీ నందిపాటి

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

4 days ago

“కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్రభాస్ గారు ప్రశంసించడం నేను గెలిచాననే ఫీల్ కలిగించింది – సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో సంతోష్ శోభన్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా ఈ రోజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు…

4 days ago

‘బ్యాండ్ మేళం’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ

మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ నిర్మించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’.…

4 days ago