బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘హైందవ’ కీలక షెడ్యూల్‌ పూర్తి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, లుధీర్ బైరెడ్డి, మహేష్ చందు, శివన్ రామకృష్ణ, మూన్‌షైన్ పిక్చర్స్ పాన్ ఇండియా మూవీ ‘హైందవ’ కీలక షెడ్యూల్‌ పూర్తి- బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

‘కిష్కింధపురి’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం అకల్ట్ థ్రిల్లర్ ‘హైందవ’ లో నటిస్తున్నారు. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో, మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గత నెలలో మారేడుమిల్లిలో జరిగిన ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ తర్వాత, చిత్ర బృందం ఇప్పుడు తమ నాల్గవ మెయిన్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.  

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్ర నిర్మాతలు ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఫెరోషియస్ మాస్ లుక్‌లో ఉన్న సాయి శ్రీనివాస్‌ సగం నీటిలో మునిగి ఉన్న ఒక పురాతన కట్టడంపై నిలబడి, అతని శరీరం నీటితో తడిసి, రక్తపు మరకలతో కనిపించడం ఆసక్తికరంగా వుంది. ఒక చేతిలో రక్తంతో తడిసిన గొడ్డలిని పట్టుకుని, మరో చేతిలో మండుతున్న ముసుగు, అతని వెనుక మెరిసే కళ్ళు  భారీ కోరలతో ఉన్న ఒక పెద్ద వరాహం కనిపించడం ఇంటన్సిటీని మరింత పెంచింది.  

సినిమా నిర్మాణంలో 70% పూర్తయిందని నిర్మాతలు తెలియజేశారు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌లో ఎక్కువ భాగం కథలోని మిస్టరీని, డ్రామాటిక్ టెన్షన్‌ను బలంగా నిలబెట్టే కీలక సన్నివేశాలకు కేటాయించారు.

ఈ సినిమా కథ శతాబ్దాల నాటి దశావతార ఆలయం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన సంయుక్త కథానాయికగా నటిస్తోంది. మహేష్ మంజ్రేకర్, సౌరభ్ సచ్‌దేవా, జెడి చక్రవర్తి, శివాజీ రాజా, గెటప్ శ్రీను వంటి నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. సామ్ సిఎస్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు, హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ పర్యవేక్షిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్  ఎడిటర్.

తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త, మహేష్ మంజ్రేకర్, సౌరభ్ సచ్‌దేవా, జెడి చక్రవర్తి, శివాజీ రాజా, గెటప్ శ్రీను

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం:
లుధీర్ బైరెడ్డి
నిర్మాత: మహేష్ చందు
బ్యానర్: మూన్‌షైన్ పిక్చర్స్
సమర్పణ: శివన్ రామకృష్ణ
DOP: హరీష్ కన్నన్
సంగీతం: సామ్ సిఎస్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచెర్ల
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ & ట్రెండ్స్

TFJA

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

3 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

6 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago