‘బఘీర’ అక్టోబర్ 31న విడుదల- ఫస్ట్ సింగిల్ అక్టోబర్ 17న రిలీజ్

ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ఉగ్రమ్, కెజిఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. KGF 1, కాంతార, సలార్ వంటి సినిమా మైల్ స్టోన్ మూవీస్ అందించిన  ప్రముఖ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది.

బఘీరలో రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.  టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. ఎజె శెట్టి డీవోపీ కాగా,  బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రణవ్ శ్రీ ప్రసాద్ ఎడిటర్, రవి సంతేహక్లు ఆర్ట్ డైరెక్టర్.

థ్రిల్లింగ్ యాక్షన్, ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్, అద్భుతమైన విజువల్స్‌ని బ్లెండ్ చేసిన ఈ మూవీ కన్నడ సినిమాలో ఒక ల్యాండ్‌మార్క్ అవుతుందని ప్రామిస్ చేస్తోంది. పలు బ్లాక్‌బస్టర్‌లను విజయవంతంగా డిస్ట్రిబ్యూషన్ చేసిన టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బఘీర చిత్రం విడుదల కానుంది. పోస్టర్లు ప్రజెంట్ చేసినట్లుగా, శ్రీమురళి సినిమాలో ఇంటెన్స్, పవర్-ప్యాక్డ్ పాత్రను పోషించారు. తెలుగు ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ రుధిర హర అక్టోబర్ 17న ఉదయం 10:35 గంటలకు విడుదల కానుంది.

తారాగణం: శ్రీమురళి, రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్, తదితరులు

సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: విజయ్ కిరగందూర్
బ్యానర్: హోంబలే ఫిల్మ్స్
కథ: ప్రశాంత్ నీల్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: డాక్టర్ సూరి
తెలుగు విడుదల: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: AJ శెట్టి
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: ప్రణవ్ శ్రీ ప్రసాద్
యాక్షన్: చేతన్ డి సౌజా
ఆర్ట్ డైరెక్టర్: రవి సంతేహక్లు
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago