టాలీవుడ్

డ్రింకర్ సాయి మూవీతో ప్రేక్షకులు ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు – హీరో ధర్మ

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. గత డిసెంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా యునానమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. “డ్రింకర్ సాయి” సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రత్యేక ప్రదర్శనను మీడియా మిత్రుల కోసం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో

డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడుతూ – మా “డ్రింకర్ సాయి” సినిమాను ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కింది. ఫస్ట్ వీక్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుని మంచి కలెక్షన్స్ తో సెకండ్ వీక్ మూవీ రన్ అవుతోంది. నేను అనుకున్న పాయింట్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. హీరో ధర్మ, హీరోయిన ఐశ్వర్య తో పాటు ప్రతి క్యారెక్టర్ ను ప్రేక్షకుల ఇష్టపడుతున్నారు. ఈ సినిమాతో దాదాపు 20 మంది కొత్త వాళ్లను ఇంట్రడ్యూస్ చేశాను. మా మూవీ రిజల్ట్ పట్ల ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉన్నారు. థియేటర్స్ లో చిన్న సినిమాల పరిస్థితి బాగా లేదు. కానీ మా మూవీకి వసూళ్లు బాగున్నాయంటూ డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. “డ్రింకర్ సాయి” మూవీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.

ప్రొడ్యూసర్ బసవరాజు లహరిధర్ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పటిదాకా 5.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రేక్షకులకు మా మూవీ రీచ్ కావడంతో మీడియా మిత్రులు ఎంతో సపోర్ట్ చేశారు. మా సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.

డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమాకు వస్తున్న రెస్పాన్స్ సంతోషంగా ఉంది. మా డైరెక్టర్ గారు చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యింది. ఈ సినిమా రిజల్ట్ పట్ల మేమంతా సంతృప్తిగా ఉన్నాం. సెకండ్ వీక్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. “డ్రింకర్ సాయి” చూడని వారంటే తప్పకుండా చూడండి. అన్నారు.

హీరో ధర్మ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమాను ఆదరించడం ద్వారా చిత్ర పరిశ్రమలో యువ హీరోగా నాకో స్థానం కల్పించారు ప్రేక్షకులు. వారికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. కొత్త వాళ్లకు ఇండస్ట్రీలో ప్రోత్సాహం ఉండదు అనేది తప్పని మీరంతా ప్రూవ్ చేశారు. హీరోగా నన్నెంతో ఎంకరేజ్ చేశారు. ఇలాంటి మంచి మూవీ నాతో చేసిన డైరెక్టర్ కిరణ్ గారికి, నిర్మాతలకు థ్యాంక్స్. మీడియా మిత్రులకు ఫ్యామిలీతో కలిసి చూసేలా “డ్రింకర్ సాయి” షో వేయాలని అనుకున్నాం. అందుకు మీ దగ్గర నుంచి వచ్చిన సపోర్ట్ సంతోషంగా ఉంది. మీరంతా సినిమా చూసి మీ ప్రశంసలు అందించడం హ్యాపీగా ఉంది. మీరు చెప్పినవన్నీ నా మనసులో ఉంచుకుని నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటాను. ఇంకా పెద్ద సక్సెస్ ఫుల్ సినిమా కోసం ప్రయత్నిస్తూనే ఉంటాను. అన్నారు.

“డ్రింకర్ సాయి” సినిమా స్పెషల్ షో చూసిన మీడియా మిత్రులు సినిమా బాగుందని, మంచి ఎంటర్ టైన్ మెంట్ తో పాటు సందేశాన్ని కూడా ఇచ్చిందని ప్రశంసలు అందజేశారు.

నటీనటులు – ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు

టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్స్ – ఎస్ఎం రసూల్, జోగు బిందు శ్రీ
స్టిల్స్ – రాజు వైజాగ్ (SVA)
వీఎఫ్ఎక్స్ – సుమరామ్ రెడ్డి.ఎన్
ఆర్ట్ – లావణ్య వేములపల్లి
కొరియోగ్రఫీ – భాను, మోయిన్
డీవోపీ – ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్
లైన్ ప్రొడ్యూసర్ – లక్ష్మీ మురారి
మ్యూజిక్ – శ్రీ వసంత్
లిరిక్స్ – చంద్రబోస్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్
రచన, దర్శకత్వం – కిరణ్ తిరుమలశెట్టి

Tfja Team

Recent Posts

I Am Super Confident in Daaku Maharaaj Shraddha Srinath

Q: You’ve been in the industry for over a decade, working with multiple stars across…

7 hours ago

డాకు మహారాజ్’ సినిమా ఒక పూర్తి ప్యాకేజ్ లా ఉంటుంది కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్

నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డాకు మహారాజ్'. వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న…

7 hours ago

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టైటిల్ హైందవ- గూస్‌బంప్స్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

యాక్షన్-హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అకల్ట్ థ్రిల్లర్ #BSS12, డెబ్యుటెంట్ డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని…

7 hours ago

నేడే మెగా స్టార్ దర్శకుడు వశిష్ట పుట్టిన రోజు

ఈరోజు బింబిసార, విశ్వంభర చిత్ర దర్శకుడు వశిష్ట పుట్టినరోజు చాలా తక్కువ మందికి మాత్రమే సినిమాలంటే పిచ్చి ఉంటుంది.. అలాంటి…

7 hours ago

సంక్రాంతికి వస్తున్నాం’లో భాగ్యం లాంటి క్యారెక్టర్ ఇప్పటివరకూ చేయలేదు ఐశ్వర్య రాజేష్

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

8 hours ago

DaakuMaharaaj WillReference Point for other Films Bobby

The highly anticipated film Daaku Maharaaj, starring Nandamuri Balakrishna, is set for a grand worldwide…

1 day ago