టాలీవుడ్

ఆర్యన్ నవంబర్ 7న తెలుగులో విడుదల

విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’, ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే తమిళ్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. నవంబర్ 7న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.  

ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. తెలుగు ఆడియన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీరు నా సినిమాలు రాక్షసన్, ఎఫ్ఐఆర్, మట్టి కుస్తీ  చాలా ప్రేమతో సపోర్ట్ చేశారు. రాక్షసన్ స్ట్రాంగ్ థ్రిల్లర్. ఎఫ్ఐఆర్ యాక్షన్ ఎమోషనల్ జర్నీ. మట్టి కుస్తీ ఫన్ ఎంటర్టైనర్. ఇప్పుడు ఆర్యన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. యూనిక్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తెలుగు ఆడియన్స్ నాకు ఎప్పుడు చాలా గొప్ప ప్రేమను అందించారు.మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి సినిమా చేయడం చాలా చాలెంజింగ్. తప్పకుండా ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్  ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ సినిమా తమిళ్ లో చాలా అద్భుతమైన విజయాన్ని సాధించింది. తెలుగు ఆడియన్స్  కూడా ఈ సినిమా నచ్చుతుందని కోరుకుంటున్నాను. డిస్ట్రిబ్యూటర్స్ శ్రేష్ఠ మూవీస్ సుధాకర్ గారికి, మా ఫ్రెండ్ నితిన్ గారికి థాంక్యూ. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా  క్లైమాక్స్ గురించి తమిళ్ లో మిక్స్డ్ ఒపీనియన్ వచ్చింది. తెలుగులో క్లైమాక్స్ మార్చి రిలీజ్ చేస్తున్నాం ఆడియన్స్ తప్పకుండా మార్చిన క్లైమాక్స్ ని నచ్చుతుంది. నవంబర్ 7 సినిమా వస్తోంది., అందరూ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.  

డైరెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ.  అందరికి నమస్కారం.  తెలుగులో ఈ సినిమా రిలీజ్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా ఆలోచన 10 ఏళ్ల క్రితం వచ్చినప్పుడే దీన్ని తెలుగులో చేయాలనుకున్నాను. ఎందుకంటే తెలుగు ఆడియన్స్  ఇలాంటి కొత్త ఆలోచనలు ఆదరిస్తారు, ఈ సినిమాని తెలుగులో చేయడానికి సపోర్ట్ చేసిన విష్ణు గారికి థాంక్యూ. తమిళనాడులో సినిమా చాలా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇక్కడ కూడా విజయం ఉంటుందని కోరుకుంటున్నాను.

శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డాకు మహారాజ్ తర్వాత మళ్లీ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆర్యన్ సినిమా నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. అక్టోబర్ 31 సినిమా తమిళ్లో రిలీజ్ అయింది. చాలా పెద్ద హిట్ అయింది. ఆడియన్స్  నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ తెలుగు ఆడియన్స్  కూడా సినిమాని చాలా అద్భుతంగా ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఇందులో ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ ప్లే చేశాను. అందరూ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను

హీరోయిన్ మానస మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి నిర్మాతలకి థాంక్యూ.  సినిమా చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. శ్రద్ధ గారు సినిమాలో చూడడానికి చాలా అందంగా ఉన్నారు. విష్ణు గారు ప్రతి మాట మనసు నుంచే మాట్లాడుతారు. నేను ఇందులో చేసిన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నవంబర్ 7న అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను.

డిఓపి హరీష్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. తెలుగు సినిమా తెలుగు ప్రేక్షకులు మాకు ఎంతో ప్రేమ ఇస్తారు. చాలా మంచి సినిమా తీశాము. థియేటర్స్ లో చూడండి కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది.

తారాగణం – విష్ణు విశాల్, సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి

నిర్మాణం – విష్ణు విశాల్ (విష్ణు విశాల్ స్టూడియోస్)
దర్శకత్వం – ప్రవీణ్ కె
నిర్మాతలు – శుభ్ర, ఆర్యన్ రమేష్, విష్ణు విశాల్
తెలుగు రిలీజ్: సుధాకర్ రెడ్డి (శ్రేష్ట్ మూవీస్)
DOP – హరీష్ కన్నన్.
సంగీతం – జిబ్రాన్.
ఎడిటర్ – శాన్ లోకేష్.
స్టంట్స్ – స్టంట్ సిల్వా, పిసి స్టంట్స్ ప్రభు.
ఎడిషల్ స్క్రీన్ ప్లే – మను ఆనంద్.
ప్రొడక్షన్ డిజైన్ – ఎస్.జయచంద్రన్.
కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్ – వినోద్ సుందర్
పీఆర్వో: వంశీ శేఖర్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

9 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago