“దండుపాళ్యం – కేజిఎఫ్ – కాంతారా”
కోవలో తెలుగులోనూ సంచలనం
సృష్టించే చిత్రం “డేంజర్ బాయ్స్”
కన్నడలో అనూహ్య విజయం సాధించి వసూళ్ల వర్షం కురిపించిన “అపాయవీడి హెచ్చరిక” చిత్రం “డేంజర్ బాయ్స్” పేరుతో తెలుగు ప్రేక్షకులను సైతం ఉర్రూతలూగించేందుకు సన్నద్ధమవుతోంది. ప్రముఖ దర్శకనిర్మాత శ్రీరంగం సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు!!
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ “డేంజర్ బాయ్స్” ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా… టీజర్ ను ప్రముఖ దర్శకనిర్మాత డాక్టర్ లయన్ సాయివెంకట్, పాటలను ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ సత్యవర్ధన్ విడుదల చేశారు. ట్రైలర్ ను తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ ఆవిష్కరించారు. ఈ వేడుక కోసం బెంగళూర్ నుంచి మొత్తం చిత్రబృందం హైదరాబాద్ రావడం విశేషం!!
“దండుపాళ్యం, కేజిఎఫ్ కాంతారా” చిత్రాల కోవలో… కన్నడలో అనూహ్య విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ సంచలనం సృష్టించడం ఖాయమని అతిధులు పేర్కొన్నారు. ఈ ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే… ఈ చిత్రం మరో “మంజమల్ బాయ్స్” అవుతుందనిపిస్తోందని వారు తెలిపారు. యశశ్విని క్రియేషన్స్ – గీతా ఫిలిమ్స్ పతాకలపై శ్రీరంగం సతీష్ కుమార్ సమర్పణలో… వి.జి.మంజునాథ్ – పూర్ణిమ ఎమ్.గౌడ్ నిర్మించిన ఈ చిత్రానికి రచన – దర్శకత్వం: అభిజిత్ తీర్ధహళ్లి. వికాస్ ఉత్తయ్య, రాధా భగవతి, అశ్విన్ హసన్, రాఘవ్ కొడబాద్రి, మిథున్ తీర్ధహళ్లి ముఖ్య తారాగణంగా కన్నడలో విజయ దుందుభి మ్రోగించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి సంగీత దర్శకుడు – ఛాయాగ్రాహకుడు ఒక్కరే కావడం గమనార్హం. సునాద్ గౌతమ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ “డేంజర్ బాయ్స్” చిత్ర సంచలన విజయంలో సముచిత పాత్ర పోషించాయి!!
ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు శ్రీరంగం సతీష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగులో కన్నడ కంటే పెద్ద విజయాన్ని అందుకోవడం ఖాయమని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తున్న శ్రీరంగం సతీష్ కి చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామని, దాన్ని ఏకకాలంలో కన్నడ – తెలుగులో తెరకెక్కిస్తామని ఈ సందర్భంగా ఈ వేదికపై ప్రకటించారు!!
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…