‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ నవంబర్ 12న రిలీజ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, మహేష్ బాబు పి, మైత్రి మూవీ మేకర్స్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ నవంబర్ 12న రిలీజ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన ప్రమోషనల్ మెటీరియల్‌తో ఈ సినిమా భారీ బజ్‌ను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్, పాటలు, టీజర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.  

ఈరోజు మేకర్స్ ఫోర్త్ సింగిల్ ఫస్ట్ డే ఫస్ట్ షో అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ డే ఫస్ట్ షో సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ వుండే ఈ సాంగ్ నవంబర్ 12న విడుదల కానుంది. రామ్ సెలబ్రేషన్స్ మోడ్ లో వున్న సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిపోయింది.  

భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్ర ఈ సినిమాలో సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారు. రావు రమేశ్‌, మురళీ శర్మ, సత్య, రాహుల్‌ రామకృష్ణ, వీటీవీ గణేష్‌  కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వివేక్‌ & మర్విన్‌ సంగీతం అందిస్తుండగా, సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫ, శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌, అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు.

‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ నవంబర్‌ 28న థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్  

సాంకేతిక సిబ్బంది:
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: మహేష్ బాబు పి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
ప్రొడక్షన్ హౌస్: మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ & T-సిరీస్ ఫిలిమ్స్
CEO: చెర్రీ
సంగీతం: వివేక్ & మెర్విన్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

TFJA

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago