భారతీయ సినిమా చరిత్రలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి వుంటారు. కాని తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు.
మరికొంత మంది నూతన నటీనటులతో పాటు ప్రముఖ సింగర్, నటుడు ఎస్‌పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన హే హలో నమస్తే హైదరాబాద్ సాంగ్‌కు, చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి అందాల తారకాసి. రాకాసి.. నా గుండె కోసి కోసి కోరికేయకే.. అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. జోస్ జిమ్మి సంగీతం అందించిన ఈ పాటను జెస్సీ గిఫ్ట్, ఎమ్.ఎమ్.మానసి ఆలపించారు. శ్రీమణి లిరిక్స్ అందించారు. దర్శకుడు మాట్లాడుతూ యూత్‌ఫుల్ మెలోడిగా సాంగ్‌గా తెరకెక్కిన ఈ సాంగ్ యూత్‌తో పాటు అందరిన్ని అలరిస్తుంది. ఈ పాట మెలోడి సాంగ్ ఆఫ్ ద ఇయర్‌గా నిలబడుతుందనే నమ్మకం వుంది. క్యాచీ లిరిక్స్‌తో..
ఫ్రెష్ ట్యూన్‌తో ఈ పాట మెస్మరైజ్ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు’ అన్నారు క్రియేటివ్ నిర్మాత నాని మాట్లాడుతూ ‘ఈ సినిమా థియేటర్‌లో యూత్‌ఫెస్టివల్‌లా వుంటుంది. కొత్తవాళ్లతో చేసిన మా సినిమా కొత్తగా వుండటంతో పాటు చాలా పెద్ద సినిమా క్వాలిటీతో వుంటుంది అన్నారు. ఈ సినిమాకు కథే హీరో. ఈ చిత్రానికి జోస్ జిమ్మి అద్భుతమైన పాటలు ఇచ్చాడు. పాట వింటూంటే అందరిలో పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి. తప్పకుండా మా పతంగ్ చిత్రం అన్నివర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం వుంది అని తెలిపారు.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన…
తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…
ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…
అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…