ఆనంద్ దేవరకొండ నటిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ “డ్యూయెట్”. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిథున్ వరదరాజ కృష్ణన్ “డ్యూయెట్”తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవాళ ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన నటిస్తున్న మదన్ క్యారెక్టర్ లుక్ ను రిలీజ్ చేశారు. మనసంతా ప్రేయసిని నింపుకున్న ప్రేమికుడిగా ఆనంద్ దేవరకొండ ఈ లుక్ లో కనిపిస్తున్నారు. త్వరలోనే “డ్యూయెట్” సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఓ డిఫరెంట్ ప్రేమ కథగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా “డ్యూయెట్” సినిమాను రూపొందిస్తున్నారు.
నటీనటులు – ఆనంద్ దేవరకొండ, రితిక నాయక్, రావు రమేష్, తదితరులు
టెక్నికల్ టీమ్
స్టూడియో గ్రీన్ టీమ్ – నేహా జ్ఞానవేల్ రాజా, జి. ధనుంజయన్, ఎ.జి.రాజా, మురళీ కృష్ణ
సినిమాటోగ్రఫీ – అరుణ్ రాధాకృష్ణన్
ఎడిటింగ్ – జి.కె. ప్రసన్న
ప్రొడక్షన్ డిజైనర్ – ఉదయ్ కుమార్
సంగీతం – జి.వి. ప్రకాష్ కుమార్
పీఆర్ఓ- జీఎస్ కె మీడియా
బ్యానర్ – స్టూడియో గ్రీన్
సహ నిర్మాత – మధుర శ్రీధర్ రెడ్డి
నిర్మాత – కె.ఇ. జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం – మిథున్ వరదరాజ కృష్ణన్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…