“తెలుగు సినీ పరిశ్రమలో అధికశాతం మహాకూటమి అనుకూలురు ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సమయంలో వారు ఎందుకు బయటకు రాలేకపోతున్నారో ఒక్కసారి ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఒకవేళ తాము బయటపడితే జగన్ రెడ్డి ఏం చేస్తారోనన్న భయం వారికి ఉన్నట్లుంది. రాజధాని లేక,, యువతకు ఉద్యోగాలు రాక అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటం కోసం సినీ పరిశ్రమలోని మహాకూటమి అనుకూలురు అంతా స్వచ్ఛందంగా ముందుకువచ్చి, కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి” అని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నట్టి కుమార్ మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, సినీ పరిశ్రమ ను జగన్ రెడ్డి బయపెడుతుండటం వల్లే కూటమికి బహిరంగంగా సపోర్ట్ చేసేందుకు బయటపడలేకపోతున్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడైనా దీని గురించి సినిమావారు మాట్లాడాలి..
ఎక్కడినుంచో ఎన్నారై లు వచ్చి తమ సొంత ఊర్లలో చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నారు.
కానీ సినిమా వారు మాత్రం ఎందుకు బయటకు రావడం లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ కూడా సపోర్ట్ చేయాలి..
ఇక పోసాని కృష్ణమురళిని సినిమా వారిని తిట్టడానికే ఎఫ్.డి.సి. చైర్మన్ పదవి ఇచ్చినట్లు ఉంది. బెదిరింపు ధోరణి లో పోసాని మాట్లాడుతున్నారు. జగన్ ని చంద్రబాబు చంపేస్తానని అన్నారంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.
పోసాని కి దమ్ము ఉంటే వివేకా హత్య కేసు, అలాగే, కోడికత్తి, గులకరాయి డ్రామా గురించి చెప్పాలి..
జగన్ చెళ్ళిళ్లకే సెక్యూరిటీ లేదు.. ఇక మహిళలకు రక్షణ ఏముంటుంది?
బటన్ నొక్కుతానని జగన్ టాక్స్ లు పెంచారు. అలాగే కరెంటు బిల్లులలో ఈడీ, సర్ చార్జీలు అదనంగా వేసి, ప్రజలపై భారం మోపుతున్నారు. వైజాగ్ లో అభివృద్ధి కావాలంటే భరత్ లాంటి యువకుడు గెలవాలి..
మీ భూముకు కబ్జా లు కావాలంటే బోత్స ఝాన్సీ కి ఓటేయాలి. అనకాపల్లిలో సిఎం రమేష్ గెలిపించుకోవటానికి అక్కడి ప్రజలు సిద్దంగా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ఉండాలంటే సిఎం రమేష్ గెలవాలి..
పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి లీడర్ రాష్ట్రానికి అవసరం..లోకేష్ ని ఓడించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు..
కానీ లోకేష్ 70వేల బంపర్ మెజారిటీ తో గెలుస్తారు. పవన్ లక్షకు పైగా మెజారిటీతో గెలవబోతున్నారు..
ముద్రగడ పద్మనాభం విసిరిన ఛాలెంజ్ విషయంలో ఓడిపోతున్నందున ముహూర్తం చూసుకుని రెడ్డి పేరు పెట్టుకునేందుకు రెడీగా ఉండాలి ముద్రగడను ఆయన కూతురే విమర్శిస్తోంది. జగన్ ఏమి హామీ ముద్రగడ కు ఇచ్చారు.
కాపు లకు కాపులే శత్రువు అనేలా ముద్రగడ వ్యవహారశైలి ఉంది. జగన్ ప్రతిపక్షం లో కూర్చోని సమాధానాలు చెప్పటానికి సిద్దంగా ఉండాలి. ఏపీలో మహాకూటమి 130 నుంచి 135 సీట్ల వరకు గెలుచుకుని అధికారంలోకి రాబోతోంది” అని అన్నారు