అల్లు అర్జున్‌గారు, ఎన్టీఆర్‌గారు.. నా పెర్ఫామెన్స్ చూసి అభినందించారు: న‌య‌న్ సారిక‌

ఆగ‌స్ట్ 15న విడుద‌లైన చిత్రం ‘ఆయ్’ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుని ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమాలో నార్నే నితిన్‌కు జంట‌గా న‌టించింది న‌య‌న్ సారిక‌. ఆయ్ స‌క్సెస్‌ను ఆమె ఎంజాయ్ చేస్తోంది. ఆ సినిమాలో ఆమె పోషించి ప‌ల్ల‌వి పాత్ర ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింద‌ని సంతోష‌ప‌డుతుంది న‌య‌న్ సారిక‌. ఈ సంద‌ర్భంగా త‌న‌పై ఇంత ప్రేమాభిమానాలు చూపించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆమె ప్ర‌త్యేక‌మైన ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసింది. ‘‘తెలుగు ప్రేక్ష‌కులు మా సినిమాను ఇంత గొప్ప‌గా ఆద‌రించినందుకు ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసుకుంటున్నాను. టాలీవుడ్‌లో ఒక మంచి విజ‌యంతో నా ప్ర‌యాణం ప్రారంభం కావ‌టం నాకెంతో సంతోషానిస్తుంది. ఓ సినిమా స‌క్సెస్ అనేది ఎంటైర్ టీమ్‌కు సంబంధించింది. అయితే ‘ఆయ్’ స‌క్సెస్ వ్య‌క్తిగ‌తంగా ఎంతో సంతోషాన్నిస్తోంది. ఇంత మంచి సినిమాలో న‌న్ను భాగం చేసిన గీతాఆర్ట్స్ సంస్థ‌కు, ద‌ర్శ‌కుడు అంజి కె.మ‌ణిపుత్ర‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేసుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు న‌య‌న్ సారిక‌.

స్కూల్, కాలేజీల్లో డ్రామాల్లో న‌టించి న‌ట‌న‌పై మ‌క్కువ పెంచుకున్న న‌య‌న్‌కు ముందు నుంచి హీరోయిన్ కావాల‌నేది కోరిక‌. ‘ఆయ్’ సినిమాలో న‌టించాల‌ని ఆమెను మేక‌ర్స్ క‌లిసిన‌ప్పుడు న‌టిగా త‌న క‌ల నేర‌వేరుతుంద‌నే దానిపై చాలా సంతోష‌ప‌డింది. ‘‘ఆయ్’ సినిమా షూటింగ్ ప్రారంభం కావ‌టానికి ముందు నేను, నార్నే నితిన్ క‌లిసి రిహార్సల్స్, వ‌ర్క్ షాప్స్‌లో పాల్గొన్నాం. తెలుగు కోసం ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను ఇచ్చాం. నా టీమ్ స‌భ్యులు కూడా నాకెంతో స‌పోర్ట్ చేశారు’’ అని తెలియ‌జేసింది న‌య‌న్ సారిక‌.

డిగ్రీ చదువుతుండగానే నటిగా నయన్ సారికకు అవకాశం వచ్చింది. సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా మెప్పించాల‌నుకున్న క‌ల నేర‌వేరుతున్న‌ప్ప‌టికీ చ‌దువుని ఆశ్ర‌ద్ధ చేయ‌కూడ‌ద‌ని ఆమె నిర్ణ‌యించుకుంది. న‌టిస్తూనే డిగ్రీని పూర్తి చేయాల‌నుకుంది. ‘ఆయ్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే ఫైన‌లియ‌ర్ డిగ్రీ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యింది న‌య‌న్ సారిక‌. ‘‘షూటింగ్‌కి నేను బుక్స్‌, స్ట‌డీ మెటీరియ‌ల్ తీసుకెళ్లేదాన్ని. డిగ్రీ ఫైన‌లియ‌ర్ ఎగ్జామ్స్ పూర్తి చేయ‌టానికి నేను క్యారీవ్యాన్‌లో షూటింగ్ గ్యాప్‌లో చ‌దువుకుంటుండేదాన్ని. ఓ వైపు షూటింగ్, మ‌రో వైపు ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ కావ‌టం అనేది చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది’’ అని షూటింగ్ రోజుల‌ను గుర్తుకు చేసుకుంది న‌య‌న్‌.

‘ఆయ్’ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన త‌ర్వాత చిత్ర యూనిట్ స‌భ్యులు ప్ర‌త్యేకంగా అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ల‌ను క‌లుసుకున్నారు. సినిమా స‌క్సెస్‌పై ఇద్ద‌రూ స్టార్స్ టీమ్ స‌భ్యుల‌ను అభినందించారు. అలాగే న‌య‌న్ సారిక న‌ట‌న‌ను ప్ర‌శంసించారు. ‘‘సినిమాలో చాలా ఈజ్‌తో నా క్యారెక్ట‌ర్‌లో న‌టించాన‌ని ఎన్టీఆర్‌గారు అభినందించారు. అల్లు అర్జున్‌గారైతే న‌న్ను ద‌క్షిణాది అమ్మాయి అనే అనుకున్నారు. కాద‌ని తెలిసి అంత చ‌క్క‌గా పాత్ర‌లో ఒదిగిపోయినందుకు ఆశ్చ‌ర్య‌పోయారు. క‌ళ్ల‌తో చ‌క్క‌గా హావ‌భావాల‌ను ప‌లికిస్తాన‌ని అల్లు అర‌వింద్‌గారు ప్ర‌శంసించారు. అంత పెద్ద స్టార్స్ నుంచి ప్ర‌శంస‌లు రావ‌టం నాకెంతో గొప్ప‌గా అనిపించింది’’ అని సంతోషాన్ని వ్య‌క్తం చేసింది న‌య‌న్ సారిక‌.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago