‘ఆల్ఫా’కోసం షూటింగ్‌ మొదలుపెట్టిన ఆలియాభట్‌

బాలీవుడ్‌ లేడీ సూపర్‌స్టార్‌ ఆలియాభట్‌ యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌ ఫిల్మ్ ‘ఆల్ఫా’కోసం షూటింగ్‌ మొదలుపెట్టారు. అత్యంత భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది ఆల్ఫా సినిమా. యష్‌రాజ్‌ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్‌ మూవీ ‘ఆల్ఫా’. ఇటీవల గ్రాండ్‌గా అనౌన్స్ అయిన ఈ సినిమా సెట్స్ కి హాజరయ్యారు నటి ఆలియా భట్‌.
ఇప్పుడు వైరల్‌ అవుతున్నది ‘ఆల్ఫా’లో ఆలియా అసలైన లుక్‌ కాదు. సినిమాలో ఆమె లుక్‌ ఎవరి ఊహలకూ అందనంత గొప్పగా ఉంటుంది. ఆమె సెట్స్ లోకి ఎంటర్‌ అవుతున్నప్పుడు క్లిక్‌మనిపించిన లుక్కే వైరల్‌ అవుతోంది.  అసలు ఆల్ఫా సెట్స్ నుంచి లుక్‌ లీక్‌ అయ్యే ఛాన్సే లేదు. సెట్‌కి అంతగా భద్రతను కల్పించింది యూనిట్‌.

ఫస్ట్ ఫీమేల్‌ లీడ్‌ యష్‌రాజ్‌ స్పై యూనివర్శ్‌గా తెరకెక్కుతోంది ‘ఆల్ఫా’. ఇందులో ఆలియా సూపర్‌ ఏజెంట్‌గా నటిస్తారు. శివ రవైల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌రాజ్‌ ఫిల్మ్స్ లో ఇంతకు ముందు ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్ట్ ‘ది రైల్వే మెన్‌’ కు డైరక్ట్ చేసిన ఘనత శివ రవైల్‌ది. భోపాల్‌ గ్యాస్‌ ట్రాజెడీ ఆధారంగా తెరకెక్కిన ఆ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు ఆడియన్స్.

యష్‌రాజ్‌ స్పై వర్శ్‌ గురించి చెప్పుకోవాలంటే ఏక్‌ థా టైగర్‌, టైగర్‌ జిందా హై, వార్‌, పఠాన్‌, టైగర్‌3 సినిమాలను ప్రస్తావించకుండా ఉండలేం. ప్రేక్షకుల్లో అత్యంత భారీ విజయాన్ని అందుకున్న సినిమాలవి. ఈ చరిష్మాతోనే ప్రస్తుతం ‘ఆల్ఫా’ను కాన్ఫిడెంట్‌గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం యష్‌రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌లో వార్‌2 తెరకెక్కుతోంది. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

3 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

6 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago