టాలీవుడ్

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఫస్ట్ లుక్ & మోషన్ వీడియో రిలీజ్

30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన పాపులర్ యాంకర్- టర్న్డ్- హీరో ప్రదీప్ మాచిరాజు తన రెండవ సినిమాతో అలరించబోతున్నారు. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పిల్లి ప్రదీప్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాంక్స్ & మంకీస్ నిర్మిస్తున్నారు. 

మేకర్స్ ఈరోజు మూవీ టైటిల్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అని అనౌన్స్ చేశారు. కోఇన్సిడెంట్లీ ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా టైటిల్ కావడం విశేషం. టైటిల్ అనౌన్స్ తో పాటు, ఫస్ట్ లుక్, మోషన్ వీడియోను రిలీజ్ చేశారు.

గ్రీన్ బ్యాక్ డ్రాప్ లో ప్రదీప్, దీపిక కళ్లలోకి చూస్తూ కనిపించిన ఫస్ట్ లుక్ వారి డాజ్లింగ్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తోంది. మోషన్ వీడియోలో విలేజ్ లో గందరగోళ పరిస్థితి మధ్య ప్రదీప్ ఇంటి నుంచి దీపిక ఇంటికి ఫైర్‌ఫ్లై ప్రయాణించే బ్యూటీఫుల్ సీన్ ని ప్రజెంట్ చేస్తోంది, ఇదొక ప్లజంట్ లవ్ స్టొరీని సూచిస్తుంది.

ప్లాట్‌లైన్‌కి వస్తే- ఒక సివిల్ ఇంజనీర్ వర్క్ కోసం ఒక గ్రామంలోకి  వస్తారు, అక్కడ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్య ఎంటర్ టైనింగ్ ప్రేమకథ, లాఫ్ లౌడ్ మూమెంట్స్, ఊహించని మలుపులు, సర్ ప్రైజింగ్ ప్రేమ కథగా వుండబోతోంది.

ఈ చిత్రంలో ప్రముఖ హాస్యనటులు వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాకి యంగ్ అండ్ ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. ప్రదీప్ మొదటి సినిమా మ్యూజికల్ హిట్, ఈ సినిమాలో కూడా మ్యూజిక్ కి ఇంపార్టెన్స్ వుంది. దీంతో, మేకర్స్ ట్యాలంటెడ్ కంపోజర్ రధన్‌ను ఎంపిక చేశారు. ఎంఎన్ బాలరెడ్డి కెమెరా మ్యాన్ గా పని చేస్తన్నారు, కోదాటి పవనకల్యాణ్ ఎడిటర్. సందీప్ బొల్లా కథ, డైలాగ్స్ అందించగా, ఆశిస్తేజ పులాల ప్రొడక్షన్ డిజైనర్.

ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ వీడియో సినిమాపై క్యురియాసిటీని పెంచాయి. మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. 

నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జి ఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ, తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

ప్రొడక్షన్ బ్యానర్: మాంక్స్ & మంకీస్ 

స్క్రీన్ ప్లే & దర్శకత్వం: నితిన్ – భరత్

సంగీతం: రధన్

డీవోపీ: MN బాలరెడ్డి

ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్

ప్రొడక్షన్ డిజైనర్: ఆశిస్తేజ పులాల

కథ & డైలాగ్స్: సందీప్ బొల్లా

కో-డైరెక్టర్: సంఘమిత్ర గడ్డం

కాస్ట్యూమ్ డిజైనర్: మానస నున్న

కొరియోగ్రఫీ: శేఖర్ Vj , విశ్వ రఘు , యష్ , రామ్

సాహిత్యం: చంద్రబోస్, రాకేందు మౌళి, శ్రీధర్ ఆవునూరి

Vfx: దక్కన్ డ్రీమ్స్

Vfx సూపర్‌వైజర్: అరుణ్ పవార్

డిఐ& ఎస్ఎఫ్ఎక్స్ & మిక్సింగ్: అన్నపూర్ణ స్టూడియోస్

డైరెక్షన్ టీం: కొలను కార్తీక్ దబ్బెట, బొక్క గౌతమి రెడ్డి, హిమవంత్, వీజే మద్దాల

అసోసియేట్ ఎడిటర్: లిఖిత్ లీ

ప్రొడక్షన్ మేనేజర్: ఏరోళ్ల ప్రమోద్ కుమార్

మేకప్ చీఫ్: ప్రవీణ్ (పాండు)

పీఆర్వో: వంశీ శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

4 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago