*అఖిల్ అక్కినేని సినిమా ‘లెనిన్’ నుంచి ‘వారెవా వారెవా..’ లిరికల్ సాంగ్ రిలీజ్.. సమ్మర్‌లో విడుద‌ల కానున్న సినిమా *

అఖిల్ అక్కినేని హీరోగా మనం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై ముర‌ళి కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తోన్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాను సోమ‌వారం రోజున ‘వారెవా వారెవా..’ అనే లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేవారు. ఈ పాట‌కు అభిమానులు, మ్యూజిక్ ల‌వ‌ర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ పాట‌ను అనంత శ్రీరామ్ రాయ‌గా.. శ్వేతా మోహ‌న్‌, జుబిన్ నౌటియాల్ త‌మ వాయిస్‌తో పాట‌కు ఓ ఎమోష‌న‌ల్ ఫీల్‌ను తీసుకొచ్చారు.

మ్యూజికల్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మన్ సంగీతం సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట‌ రొమాంటిక్ ఫీల్‌ను క‌లిగిస్తోంది. సినిమాలోని భావోద్వేగాలను చక్కగా ప్రతిబింబిస్తూ, హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేసేలా పాట ఉంది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.

శ‌ర‌వేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు 70 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసింది. మూవీని సమ్మర్‌లో రిలీజ్ చేయ‌టానికి మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని స‌ర‌స‌న భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గాన‌టిస్తోంది.

న‌టీన‌టులు:అఖిల్ అక్కినేని, భాగ్య‌శ్రీ బోర్సె త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్స్: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నిర్మాత‌లు: అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
ద‌ర్శ‌క‌త్వం:
ముర‌ళి కిషోర్ అబ్బూరు
సంగీతం: త‌మ‌న్‌.ఎస్‌
Presented by: Annapurna Studios

TFJA

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

2 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

2 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

2 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

2 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

2 days ago