▪️ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మాదిరిగానే ‘కలర్స్’ కూడా బ్లాక్‌బస్టర్ కావాలి
▪️ ఘనంగా ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ని ప్రారంభోత్సవం
హైదరాబాద్ :
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ (Kolors Healthcare) బంజారా హిల్స్ బ్రాంచీలో సందడి చేసింది. ఈ సందర్భంగా ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ని ప్రారంభించింది. ఆధునిక టెక్నాలజీతో ఈ సంస్థ అందిస్తున్న సేవలను ఆమె స్వయంగా పరిశీలించింది.
అనంతరం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరికీ హెల్త్ కేర్ ఎంతో ముఖ్యమని, ఈ సేవలను ఎంతో నాణ్యంగా, ఆధునిక టెక్నాలజీతో అందిస్తున్న ‘కలర్స్’ సంస్థ నిర్వాహకులను ఆమె అభినందించింది. ప్రతి ఒక్కరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాము. అలాంటి సేవలను అందిస్తూ ఎంతో మందిని ఆరోగ్యపరంగా సంతృప్తి పరిచిన సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ అని కొనియాడారు. ”లైఫ్‌స్టైల్ బాగుండాలని కోరుకునే వారందరికీ ఈ సంస్థ మెరుగైన సేవలు అందిస్తూ ఇప్పుడు ఆధునిక సాంకేతికతను జోడించుకుని ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’గా ఎదగడం సంతోషం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మాదిరిగానే ‘కలర్స్’ కూడా బ్లాక్‌బస్టర్ కావాలి” అని ఐశ్వర్య రాజేష్ ఆకాంక్షించారు.
‘కలర్స్ హెల్త్ కేర్’ సీవోవో శివాజీ కూన మాట్లాడుతూ.. 2004లో ప్రారంభించిన ‘కలర్స్ హెల్త్ కేర్’ సేవలకు మరింత అడ్వాన్స్ టెక్నాలజీని జోడిస్తూ ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించినట్టు తెలిపారు. ఇప్పటికీ 50 బ్రాంచీలు ఉన్న తమ ‘కలర్స్ హెల్త్ కేర్’ను వచ్చే ఏడాది చివరి కల్లా దేశవ్యాప్తంగా 250 బ్రాంచీలకు విస్తరించనున్నట్లు ప్రకటించారు.
‘కలర్స్ హెల్త్ కేర్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాయుడు మాట్లాడుతూ.. యూఎస్ – ఎఫ్డీఏ అఫ్రూవుడ్ టెక్నాలజీతో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించినట్టు తెలిపారు.
‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా అతిథులుగా పాల్గొన్న మినర్వా హోటల్స్ అధినేత, మాజీ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, సీబీఐటీ డైరెక్టర్ దివ్యారెడ్డి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…