తెలుగు వారి ఫేవరేట్ ఓటీటీ ఆహా ఈ ఏడాది మరింత ఎగ్జైటింగ్ కంటెంట్ ను లైనప్ చేస్తోంది. డ్యాన్స్ ప్రోగ్రామ్స్, మూవీస్, కామెడీ షోస్, వెబ్ సిరీస్, కొత్త సినిమాలతో మనదైన వినోదాన్ని అందించేందుకు ఆహా రెడీ అయ్యింది. ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ తో ఈ ఏడాది తన ఎంటర్ టైన్ మెంట్ యాక్షన్ ప్లాన్ ను ఆహా రివీల్ చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ షోలో మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజు, యశ్ మాస్టర్, ప్రకృతి కంబం, జాను లైరి మెంటార్స్ గా, ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ లుగా డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ఆహాకు ఈ ఏడాది హ్యూజ్ బిగినింగ్ ఇచ్చింది.
రుచికరమైన వంటకాలను పరిచయం చేస్తూ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టేస్టీ ప్రోగ్రాం చెఫ్ మంత్ర సీజన్ 4 స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈషా రెబ్బా, కుషిత, రాశి సింగ్, సత్య, హర్ష మరియు ప్రభాస్ శ్రీను కీ రోల్స్ చేసిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్ సీజన్ 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్రీ రోజేస్ మొదటి సీజన్ సక్సెస్ ను మరింత రీచ్ తో సీజన్ 2 కొనసాగించనుంది. రాజ్ తరుణ్, కుషిత కల్లపు నటించిన ‘చిరంజీవా’ చిత్రం ఆహాలో రిలీజ్ కు రెడీ అవుతోంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మాతో ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ హోమ్ టౌన్ కూడా త్వరలో ఆహా సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులోకి రానుంది. దర్శకుడు శ్రీకాంత్ ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ కామెడీ గేమ్ షో సర్కార్ సీజన్ 5 తో గ్రాండ్ గా తిరిగి వస్తోంది.
ఈ వర్సటైల్ కంటెంట్ లైనప్ పై ఆహా ఓటీటీ సీయీవో రవికాంత్ సబ్నావిస్ మాట్లాడుతూ – ఆహా ఐదో వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ ఏడాది మాకు కీలకమైన సంవత్సరం. మనదైన వినోదాన్ని వివిధ రకాల ప్రోగ్రామ్స్ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నాం. వినూత్నమైన కార్యక్రమాలను ప్రేక్షకులకు నచ్చే అన్ని జానర్స్ లో రెడీ చేస్తున్నాం. క్వాలిటీ కంటెంట్ తో కొత్త ఫార్మాట్స్ లో ఎంటర్ టైన్ మెంట్ అందించబోతున్నాం. ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ మా టీమ్ కు సంతోషాన్ని అందిస్తున్నాయి. అన్నారు.
ఆహా ఓటీటీ కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ – ఈ ఏడాది మా ఆహా ఓటీటీకి ప్రత్యేకమైన సంవత్సరం. ప్రేక్షకులకు నచ్చేలా వివిధ ఫార్మేట్స్ లో డైనమిక్ కంటెంట్ రెడీ చేశాం. ఈ ఏడాది అంతా ఆహాలో అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాం. మన నేటివ్ ప్రోగ్రామ్స్ కే ప్రాధాన్యత కల్పిస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించే క్రమంలో మేము చేస్తున్న ఈ ప్రయత్నం ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అన్నారు.
Megastar Chiranjeevi has yesterday ( 19 March 2025 ) added another jewel to his crown……
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జాక్ - కొంచెం క్రాక్’. వైష్ణవి…
టాలీవుడ్‌లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే…
ఖురేషి అబ్‌రామ్ యొక్క చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టండి: మార్చి 20న మలయాళ సూపర్‌స్టార్, కంప్లీట్‌యాక్టర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్…
American actor Kyle Paul took to his social media to share his thoughts about starring…
రాకింగ్ స్టార్ యష్.. లేటెస్ట్ సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ గురించి అమెరికన్…