సోషల్ మీడియాలో విచ్చలవిడి రాతలపై ఫిర్యాదు చేసిన TFJA

సోషల్‌ మీడియాలో పిచ్చిరాతలు రాసేవారి ఆటకట్టు…
తెలుగు సినిమా పరిశ్రమలో సోషల్‌ మీడియా వేదికగా ఈ మధ్య రకరకాలైన వ్యక్తులు తమ స్వార్ధం కోసం అనేక విధాలుగా మీడియాలో విషం చిమ్ముతున్నారు. వీరంతా వ్యక్తిగతమైన ధూషణలు చేస్తూ తెలుగు సినిమా మీడియాలో కీలకంగా ఉన్నవారిని టార్గెట్‌ చేస్తూ మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తున్నారు.

గతంలో కూడా ఇటువంటి అనేక చర్యలకు పాల్పడటంతో సినిమా నిర్మాణంలో కీలకంగా ఉన్న కొంతమంది నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా వీరికి బాధితులే. అందుకే తెలుగు ఫిలిమ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (టి.ఎఫ్‌.జె.ఎ) ప్రెసిడెంట్‌ వి.లక్ష్మీనారాయణ, జనరల్‌ సెక్రటరీ వై.జె రాంబాబులు తమ అనుబంధ సంస్థ అయిన తెలుగు ఫిల్మ్‌ డిజిటల్‌ మీడియా అసోసియేషన్‌లోని (టి.ఎఫ్‌.డి.ఎ) ప్రెసిడెంట్‌ ప్రేమ, ట్రెజరర్‌ శివమల్లాలతో కలిసి డిజిపి రవిగుప్తా, హైదరాబాద్‌ సిపి.

కొత్తకోట. శ్రీనివాసరెడ్డిగార్లను కలిసి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వివరించారు. పరిస్థితిని విన్న అధికారులు నిజంగానే కొన్నివార్తలు మా దృష్టికి వచ్చాయని మీరు కూడా కరెక్ట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌తో ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని కలిస్తే సోషల్‌ మీడియాని వెబ్‌సైట్లలో, యూట్యూబ్‌ల్లో విచ్చలవిడి రాతలు రాసే వారిని తీసుకువచ్చి తగుచర్చలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా (టి.ఎఫ్‌.జె.ఎ), (టి.ఎఫ్‌.డి.ఎ) అసోసియేషన్‌లో జరిగే మంచి పనులను ఎలా చేస్తున్నామో వివరించారు మీడియా ప్రతినిధులు .

మరో రెండు రోజుల్లో రూమర్లు పుట్టించి తమ పబ్బం గడుపుకునే వారిని పట్టుకుని విచారిస్తామని హామి ఇచ్చారు. మరో రెండురోజుల్లో పోలీస్‌ ప్రతినిధులతో కీలకమై సమావేశాన్ని నిర్వహించనున్నారు యూనియన్‌ ప్రతినిధులు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago