శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది ‘శంబాల’ సినిమా. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే గాక నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టి క్రిస్మస్ విన్నర్ గా నిలిచింది. ముఖ్యంగా ఆదికి మాత్రం శంబాల సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి.

యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అర్చన ఐయ్యర్ హీరోయిన్ గా నటించింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యగంధర్ ముని తెరకెక్కించిన తీరు, కొత్త పాయింట్‌ను టచ్ చేయడం, అన్ని రకాల అంశాల్ని జోడించి తెరకెక్కించడం కలిసి వచ్చిన అంశం. ఈ నేపథ్యంలో శంబాల థాంక్స్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరై, చిత్రయూనిట్ మొత్తాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ”అందరికీ నమస్కారం. ఈ సినిమా దర్శకులు యుగందర్ గారికి, ఇద్దరు నిర్మాతలు రాజశేఖర్, మహిధర్ రెడ్డి గార్లకు అదేవిధంగా ఆది సాయి కుమార్, అర్చన సహా చిత్రయూనిట్ మొత్తానికి కంగ్రాట్స్. క్రిస్మస్ కి విడుదలైన 5 సినిమాల్లో శంబాల సక్సెస్ గా నిలబడటం గ్రేట్. లాస్ట్ మంత్ నేను విదేశాల్లో ఉన్నా. విడుదలైన అన్ని సినిమాల ఫాలో అప్ చేస్తుంటే శంబాల 100 పర్సెంట్ సక్సెస్ అని విన్నా. ఈ సినిమాకు పబ్లిక్ లో మంచి టాక్ రావడం, విజయవంతంగా నిలబడటం చాలా సంతోషకర విషయం. ఈ సినిమా ఆదికి 25వ సినిమా, ఈ 25వ సినిమా విజయవంతం కావడం రియల్లీ హ్యాపీ. ఒకప్పుడు బొమ్మరిల్లు సినిమా సినీ ఇండస్ట్రీలో చాలా చేంజ్ తీసుకొచ్చింది. నిజంగా బొమ్మరిల్లు 2 తీయాలంటే మాత్రం ఆది, వాళ్ళ నాన్న సాయి కుమార్ లతో తీయాలి. కొడుకు సక్సెస్ కోసం తండ్రి పడే తపన మాటల్లో చెప్పలేం. అలా సాయి కుమార్ గారు తన కొడుకుతో పాటు శంబాల టీమ్ మొత్తానికి బ్యాక్ బోన్ గా నిలిచి సినిమా విజయంలో భాగమయ్యారు. సాయి కుమార్ ఇండస్ట్రీలోని అందరితో చాలా బాగుంటారు. ఇది టాలీవుడ్ లో ఆయన ఒక్కడికే చెల్లింది. ఈ సినిమా ప్రోమో చూసినప్పుడే చెప్పా ఇది సక్సెస్ అవుతుందని. ఇప్పుడు అదే జరిగింది. ఈ రోజుల్లో ఒక సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేయడం, సక్సెస్ కావడం మామూలు విషయం కాదు. శంబాల అది చేసి చూపించింది. అందరికీ మరోసారి కంగ్రాట్స్” అన్నారు.

ఆది సాయికుమార్ మాట్లాడుతూ..అందరికీ థ్యాంక్స్. ఈ రోజు మా సినిమా థాంక్స్ మీట్ కి దిల్ రాజు గారు రావడం చాలా హ్యాపీగా ఉంది. టీం మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు. ఎంతో పోటీ నడుమ విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ రన్ అవుతూ ఉండటం పట్ల పట్టలేని ఆనందంతో ఉన్నాం. ఈ సినిమాను మౌత్ టాక్ తో ముందుకు తీసుకెళ్తున్న ఆడియన్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇకపై కెరీర్ బాగా ప్లాన్ చేసుకొని ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాను. ఈ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలన్నింటికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.

సాయి కుమార్ మాట్లాడుతూ..దిల్ రాజు గారు అందరి గురించి ఆలోచిస్తారు. సపోర్ట్ చేస్తారు. ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటారు. పోలీస్ స్టోరీ నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. ఆ రోజు పోలీస్ స్టోరీకి నాకు మెమెంటో రావడం ఇప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు మా శంబాల చిత్ర యూనిట్ అందరికీ దిల్ రాజు గారు మెమెంటో అందిస్తున్నారు. ఆయనకు అందరి తరఫున స్పెషల్ థ్యాంక్స్. శంబాల మంచి కిక్కిచ్చింది. అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన సినిమా బాగుండాలి అని కోరుకునే మనిషిని. ఈ సినిమాను టాలీవుడ్ అంతా సెలబ్రేట్ చేసుకుంటోంది. మంచి కంటెంట్ ఎప్పుడూ గెలుస్తుంది అని శంబాల నిరూపించింది. దేశ విదేశాల నుంచి ఎందరో మిత్రులు ఫోన్ చేసి అభినందనలు చెబుతున్నారు. ఈ సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లందరికీ పేరు పేరునా థ్యాంక్స్. జనవరి 9న హిందీలో రిలీజ్ అవుతోంది. అక్కడ కూడా సక్సెస్ అవుతుందని భావిస్తున్నా” అన్నారు.

దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ.. ఈ సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మంచి కంటెంట్ తో సినిమా వస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని మరోసారి రుజువైంది. కొన్ని థియేటర్స్ లో మా శంబాల సినిమా కంటిన్యూస్ గా 11 రోజులు హౌస్ ఫుల్ తో ప్రదర్శించబడింది. ఈ సినిమా నిర్మాతలు మహిధర్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు ఎంతో సపోర్ట్ చేసి నాతో సహా ఈ సినిమాలో భాగమైన అందరికీ లైఫ్ ఇచ్చారు. ఆది గారు మీరు లేకుండా ఈ సినిమా లేదు. చాలా థ్యాంక్స్. అర్చన థ్యాంక్స్” అన్నారు.

నిర్మాత మహిధర్ రెడ్డి మాట్లాడుతూ..అందరికీ థ్యాంక్స్. డైరెక్షన్ టీం, మ్యూజిక్ టీం కి స్పెషల్ థ్యాంక్స్. చరణ్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ఆడియన్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు” అన్నారు.

మరో నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ..మా ఈవెంట్ కి వచ్చిన దిల్ రాజు గారికి థ్యాంక్స్. ఈ సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు” అన్నారు.

హీరోయిన్ అర్చన అయ్యర్ మాట్లాడుతూ..థ్యాంక్స్ టు మీడియా అండ్ ఆడియన్స్. ఈ సినిమా థ్యాంక్స్ మీట్ కి దిల్ రాజు గారు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా నిర్మాతలు, చిత్రయూనిట్ మొత్తానికి థ్యాంక్స్” అన్నారు.

అనంతరం శంబాల సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్కరికీ, చిత్ర యూనిట్ మొత్తానికి తన చేతుల మీదుగా మెమెంటో అందించి కంగ్రాట్స్ చెప్పారు దిల్ రాజు.

TFJA

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 day ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 day ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 day ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 day ago

వరలక్ష్మి శరత్ కుమార్, పూజా శరత్ కుమార్, దోస డైరీస్ ప్రొడక్షన్ నంబర్ 1 ‘సరస్వతి’ షూటింగ్ పూర్తి

తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో తొలిసారిగా దర్శకురాలిగా మారిన వరలక్ష్మి శరత్ కుమార్, తానే…

1 day ago