* భారీ పాన్ ఇండియా సినిమాను డైరెక్ట్ చేస్తున్న పవన్ సాధినేని
మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్..తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీ పరిచయం అక్కర్లేని పేరు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో తనదైన ముద్రవేశారీ అగ్ర కథానాయకుడు. తెలుగులోనూ మహానటి, సీతారామం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఈయన అలరించిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా విడుదలైన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీలోనూ అతిథి పాత్రలోనూ దుల్కర్ అలరించారు. ఇప్పుడు ఈయన కథానాయకుడిగా తెలుగులో ఓ సినిమా ప్రారంభమైంది.
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు దుల్కర్ సల్మాన్ ఇప్పుడు యూనిక్ సినిమాలు, విలక్షణమైన కథాంశాలతో దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న పవన్ సాధినేనితో చేతులు కలిపారు. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘ఆకాశంలో ఒక తార’గా తెరకెక్కబోతున్న ఈ మూవీ పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్ లుక్ చాలా సింపుల్‌గా ఉంది. ఓ రైతులా కనిపిస్తున్నారు. అదే పోస్టర్‌లో ఓ అమ్మాయి స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళుతుండటాన్ని చూడొచ్చు. దుల్కర్ మరో డిఫరెంట్ రోల్‌తో అలరించబోతున్నారనే విషయం పోస్టర్ ద్వారా స్పష్టమైంది. ఆడియెన్స్‌లో ఓ క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. హృదయాన్ని హత్తుకునే ఎంటర్‌టైనర్‌గా సినిమా మెప్పించనుందనే విషయం స్పష్టమవుతుంది.
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాలతో పాటు లైట్ బాక్స్ మీడియా బ్యానర్స్ సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ మూవీని నిర్మిస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థలు ఈ మూవీ నిర్మాణంలో భాగమవుతుండటం అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.
త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు, సినీ ప్రేక్షకులు ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ కోసం ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేస్తున్నారు. రాబోయే ఈ వివరాలను అంచనాలను మరింత పెంచేలా ఉంటాయనటంలో సందేహం లేదు. ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో అలరించనుంది.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన…
తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…
ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…
అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…