సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్’ అనే బుక్ – దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ అనే సినిమా తీశాడు.. సాక్ష్యాల‌తో స‌హా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్’ అనే బుక్ అందుబాటులోకి తెచ్చాను: ‘ప్రేమించొద్దు’ దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శిరీన్ శ్రీరామ్ తనకు సాయి రాజేష్ చేసిన అన్యాయం, తన కథను కాపీ కొట్టి బేబీగా తీయడం మీద మరోసారి స్పందించాడు. సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ బేబీ లీక్స్ బుక్‌ను మీడియా ముందుంచారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో..

శిరీన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘రవి కిరణ్ అనే వ్యక్తిని 2015లో కలిశాను. తరువాత రవి కిరణ్ ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ చూసి ఓ పాయింట్ అనుకున్నాను. ఓ అమ్మాయిని ఇద్దరబ్బాయిలు కలిసి చంపారనే పోస్ట్ చూసి కథ అనుకున్నాం. దాన్ని ఓ బస్తీ అమ్మాయి పాత్రతో లింక్ చేసి కథ రాసుకున్నా. ఆ టైంలో నిర్మాత సాయి రాజేష్ గారితో ఏడాది ప్రయాణం చేశాను. నాకు దర్శకుడిగా అవకాశం ఇస్తూ ఆయనే సినిమాను నిర్మిస్తానని అన్నారు. అయితే ఆలస్యం అవుతూ వచ్చింది. కారణాలేమైనా ఉండొచ్చేమో అనిపించి, ఆయన సినిమా నిర్మించడం లేదని నేను బయటకు వచ్చేశాను. అప్పుడు మాకేం గొడవ జరగలేదు. త‌ర్వాత నాకు ద‌ర్శ‌క‌త్వం అవ‌కాశం ఇస్తాన‌న్న‌వాడు.. నా క‌థ‌ను కాపీ కొట్టి అదే బస్తీ అమ్మాయి.. ఇద్దరబ్బాయిల్ని ప్రేమించే కథతో బేబీ అనే ఓ బూతు సినిమా తీశాడు. 2023 జూలైలో సినిమా రిలీజ్ అయినప్పుడు రచ్చ చేయలేదు. నాకు రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సాక్ష్యాలు అన్నీ సంపాదించి లాయర్ నిఖిలేష్ గారిని కలిశాను. కాపీరైట్ లీగల్ నోటీస్ పంపాం. కానీ నాకే ఆయన ఆ కథను చెప్పాడని ఆ నోటీసులో రిప్లై ఇచ్చాడు. హృదయ కాలేయం సినిమాకు ఫ్రీగా టీజర్ డైరెక్ట్ చేసి, ఎడిట్ చేసి ఇచ్చాను. సాయం చేసిన వాళ్లకే వెన్నుపోటు పొడిచే రకం. ఫిబ్రవరిలో రాయదుర్గంలో కేస్ ఫైల్ చేశాను. నన్ను బద్నాం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదులు చేశాడు. ఆయన మీద బేబీ లీక్స్ అనే పుస్తకాన్ని కూడా రాశాను. దాన్ని మీడియా ముందుకు తీసుకొస్తున్నాను. https://babyleaks2023.blogspot.com/ అనే ఆన్ లైన్లో మాధ్య‌మంలో పీడీఎఫ్ కూడా ఉంది. వెబ్ సైట్ కూడా ఉంది. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నాడు.

రవి కిరణ్ మాట్లాడుతూ.. ‘పోలీసులు, కోర్టు, మీడియా వల్ల న్యాయం జరుగుతుందని నమ్ముతాం. 2012 నుంచి శిరీన్‌తో నాకు పరిచయం. అన్నపూర్ణలో డైరెక్షన్ కోర్సు చేశాను. 2015లో పేపర్ ఆర్టికల్ చూసి పోస్ట్ చేశా. ఆ చిన్న ఆర్టికల్‌ను చూసి శిరీన్ కాల్ చేశాడు. స్టోరీగా మార్చి సినిమా తీద్దామని అన్నాడు. అమ్మాయి ఇద్దర్ని ప్రేమించింది.. ఆ ఇద్దరూ కలిసి అమ్మాయిని చంపే ప్రయత్నం చేస్తారు అనే పాయింట్‌తో కథను రాసుకున్నాడు. స్కూల్ ఏజ్ అమ్మాయితే బాగుంటుందని ఆ స్టోరీని అలా అల్లుకున్నాడు. అబ్బాయిల్లో ఒకరు రిచ్, ఒకరు పూర్ అయితే బాగుంటుందని శిరీన్ ఆ రోజే నాకు చెప్పాడు. నేను లై డిటెక్షన్‌కు సిద్దం.. సాయి రాజేష్ సిద్దమా?.. నేను సాయి రాజేష్‌ని పదేళ్ల క్రితమే బ్లాక్ చేశా. జూన్ 7న ప్రేమించొద్దు రాబోతోంది. శిరీన్ డ్రీమ్‌ను సాయి రాజేష్ నాశనం చేశాడు. మీడియానే న్యాయం చేయాలి’ అని అన్నారు.

లాయర్ నిఖిలేష్ తొగరి మాట్లాడుతూ.. ‘ఫేస్ బుక్ ద్వారా శిరీన్ పరిచయం. ఆయన తీసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూశాను. ఒకసారి ఆయన ఫోన్ చేసి ఈ బేబీ కాపీ గురించి చెప్పాడు. సాక్ష్యం ఎలా పట్టుకొస్తావ్ అని అడిగితే.. ప్రతీ దాన్ని డేట్‌తో సహా భద్రపర్చుకున్నాడు. ఇవన్నీ చూసి షాక్ అయ్యాను. ఇంత పకడ్బంధీగా దాచుకోవడం ఆశ్చర్యమేసింది. ఫిల్మ్ మేకింగ్ అంటే నాకు ఇష్టం. క్రియేటివ్ పర్సన్‌కు ఇలా జరగడం బాధగా ఉంది. పోలీసులు కూడా ఈ సాక్ష్యాలు చూసి షాక్ అయ్యారు. చీటింగ్, క్రిమినల్ కాన్‌స్పిర‌సీ, కాపీ రైట్ యాక్ట్‌కి సంబంధించిన ప‌లు సెక్ష‌న్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శిరీన్ తన ప్రమోషన్స్‌లో తాను ఉంటే ఛాంబర్లుక లేఖలు రాస్తున్నారట. అందుకే ఇలా మీడియా ముందుకు వచ్చి సాక్ష్యాలను బుక్ రూపంలో తీసుకొచ్చి అందరికీ చూపిస్తున్నాడు’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago