య‌ష్ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు 100 రోజులు మాత్రమే..సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసిన మేక‌ర్స్‌

  • కొత్త టెక్నిషియ‌న్స్‌ను అనౌన్స్ చేసిన టీమ్‌

‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొద‌లైంది. మార్చి 19, 2026న సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అంటే సినిమా రిలీజ్‌కు మ‌రో వంద రోజుల స‌మయం మాత్ర‌మే ఉంది. వ‌చ్చే ఏడాది అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తోన్న సినిమాల్లో ఇదొక‌టి. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్‌తో సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లేలా చిత్ర యూనిట్ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ నుంచి ఓ స‌రికొత్త‌, ప‌వ‌ర్ఫుల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. సెక్సీ, ర‌గ్డ్ లుక్‌లో య‌ష్ ఇందులో క‌నిపిస్తున్నాడు. మెలి తిరిగిన కండ‌ల‌తో త‌నొక ర‌క్తంత నిండిన బాత్ ట‌బ్‌లో కూర్చుని ఉన్నాడు. త‌న ముఖం పూర్తిగా క‌నిపించ‌టం లేదు. త‌న‌పై వెలుగు ప‌డుతుంది.. త‌ను బ‌య‌ట‌కు దేన్నో తదేకంగా చూస్తున్న‌ట్లున్నాడు. త‌న శ‌రీరంపై ఉన్న టాటూస్ చూస్తుంటే త‌న‌లోని బ్యాడ్ యాష్ వైబ్‌ను క్యారెక్ట‌ర్‌ను పోస్ట‌ర్‌తో ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుంది. ఈ పోస్ట‌ర్‌పై అభిమానులు, ప్రేక్ష‌కులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.
‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ సినిమాను మంచి పండుగ సీజ‌న్‌లో రిలీజ్ చేస్తున్నారు. గుడి ప‌డ్వ, ఉగాది, ఈద్ క‌లిసిన వారాంతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి ఛాన్స్‌ను క్రియేట్ చేస్తోంది.

టాక్సిక్ సినిమాకు సంబంధించిన స‌రికొత్త పోస్ట‌ర్‌తో పాటు సినిమా అద్భుతంగా రావ‌టంలో త‌మ‌దైన పాత్ర‌ను పోషిస్తోన్న టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను కూడా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. జాతీయ అవార్డు గ్రహీత రాజీవ్ రవి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, సంగీతాన్ని యష్‌తో KGFలో కలిసి పనిచేసిన రవి బస్రూర్ అందిస్తున్నారు. ఎడిటింగ్ వ‌ర్క్‌ను ఉజ్వల్ కులకర్ణి ..ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను టీపీ ఆబిద్ నిర్వహిస్తున్నారు. జాన్ విక్ వంటి చిత్రాల‌కు ప‌ని చేసిన హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ, జాతీయ అవార్డు గ్రహీత అన్బరివ్ కలిసి ఈ చిత్రంలోని కీలక యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.

య‌ష్‌, గీతూ మోహ‌న్ దాస్ రాసిన ఈ క‌థ‌ను గీతూ మోహ‌న్ దాస్ డైరెక్ట‌ర్ చేస్తున్నారు. ఇంగ్లీష్‌, క‌న్న‌డ‌లో సినిమాను చిత్రీక‌రిస్తోన్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, మ‌ల‌యాళం స‌హా ఇత‌ర భాష‌ల్లో అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై వెంక‌ట్ కె.నారాయ‌ణ‌, య‌ష్ ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

TFJA

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago