- కొత్త టెక్నిషియన్స్‌ను అనౌన్స్ చేసిన టీమ్
‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. మార్చి 19, 2026న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అంటే సినిమా రిలీజ్‌కు మరో వంద రోజుల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఏడాది అందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోన్న సినిమాల్లో ఇదొకటి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్‌తో సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లేలా చిత్ర యూనిట్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ నుంచి ఓ సరికొత్త, పవర్ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. సెక్సీ, రగ్డ్ లుక్‌లో యష్ ఇందులో కనిపిస్తున్నాడు. మెలి తిరిగిన కండలతో తనొక రక్తంత నిండిన బాత్ టబ్‌లో కూర్చుని ఉన్నాడు. తన ముఖం పూర్తిగా కనిపించటం లేదు. తనపై వెలుగు పడుతుంది.. తను బయటకు దేన్నో తదేకంగా చూస్తున్నట్లున్నాడు. తన శరీరంపై ఉన్న టాటూస్ చూస్తుంటే తనలోని బ్యాడ్ యాష్ వైబ్‌ను క్యారెక్టర్‌ను పోస్టర్‌తో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లుంది. ఈ పోస్టర్‌పై అభిమానులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ సినిమాను మంచి పండుగ సీజన్‌లో రిలీజ్ చేస్తున్నారు. గుడి పడ్వ, ఉగాది, ఈద్ కలిసిన వారాంతం బాక్సాఫీస్ దగ్గర మంచి ఛాన్స్‌ను క్రియేట్ చేస్తోంది.
టాక్సిక్ సినిమాకు సంబంధించిన సరికొత్త పోస్టర్‌తో పాటు సినిమా అద్భుతంగా రావటంలో తమదైన పాత్రను పోషిస్తోన్న టెక్నీషియన్స్ వివరాలను కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. జాతీయ అవార్డు గ్రహీత రాజీవ్ రవి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, సంగీతాన్ని యష్‌తో KGFలో కలిసి పనిచేసిన రవి బస్రూర్ అందిస్తున్నారు. ఎడిటింగ్ వర్క్‌ను ఉజ్వల్ కులకర్ణి ..ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను టీపీ ఆబిద్ నిర్వహిస్తున్నారు. జాన్ విక్ వంటి చిత్రాలకు పని చేసిన హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ, జాతీయ అవార్డు గ్రహీత అన్బరివ్ కలిసి ఈ చిత్రంలోని కీలక యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.
యష్, గీతూ మోహన్ దాస్ రాసిన ఈ కథను గీతూ మోహన్ దాస్ డైరెక్టర్ చేస్తున్నారు. ఇంగ్లీష్, కన్నడలో సినిమాను చిత్రీకరిస్తోన్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, మలయాళం సహా ఇతర భాషల్లో అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

