హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా “ది ట్రయల్” సినిమా ట్రైలర్ లాంఛ్

స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “ది ట్రయల్”. ఈ సినిమాను ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “ది ట్రయల్” చిత్రాన్ని టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిల్మ్ గా దర్శకుడు రామ్ గన్ని రూపొందించారు. స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. సుదర్శన్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇప్పటిదాకా తెలుగు తెరపై చూడని కంప్లీట్ ఇంటరాగేటివ్ కథతో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇవ్వబోతున్న “ది ట్రయల్” సినిమాను ఈ నెల 24న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇవాళ చిత్ర ట్రైలర్ ను హీరో శ్రీ విష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ – “ది ట్రయల్” మూవీ ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా ఉంది. థ్రిల్లర్ జానర్ సినిమా ఇది. డైరెక్టర్ రామ్ బాగా కథను డీల్ చేశారని ట్రైలర్ తో తెలుస్తోంది. ఈ నెల 24న సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. “ది ట్రయల్” మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. టీమ్ అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. “ది ట్రయల్” చిత్ర బృందానికి నా బెస్ట్ విశెస్ చెబుతున్నా అని అన్నారు.

“ది ట్రయల్” ట్రైలర్ ఎలా ఉందో చూస్తే…సబ్ ఇన్ స్పెక్టర్ మిసెస్ రూప, ఆమె భర్త అజయ్ వాళ్ళ మొదటి మేరేజ్ ఆనివర్సరీ ఒక అపార్ట్మెంట్ మెడపైన ఏకాంతంగా జరుపుకుంటున్నప్పుడు అనుకోని సమయంలో అజయ్ కాలు జారి బిల్డింగ్ పై నుంచి పడి చనిపోతాడు. ఇది మీడియాలో పెద్ద న్యూస్ అవుతుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్.. రూప తన భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందని అనుమానిస్తాడు. ఆమెను ఇంటరాగేట్ చేస్తాడు. రూప మాత్రం తన భర్తది ఆత్మహత్యేనని గట్టిగా చెబుతుంది. ఇంతకీ అజయ్ ది హత్యా?, ఆత్మహత్యా?, హత్యే అయితే పోలీస్ ఆఫీసర్ అయిన రూప తన భర్తనే ఎందుకు చంపింది అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తి కలిగించింది. ట్రైలర్ కలిగించిన క్యూరియాసిటీ థియేటర్స్ కు ప్రేక్షకుల్ని రప్పిస్తుందని “ది ట్రయల్” మూవీ టీమ్ ఆశిస్తోంది. అలాగే ముఖ్యంగా స్పందన పల్లి, యుగ్ రామ్ మరియు వంశీ కోటుల యొక్క నటన చాలా అద్భుతంగా చేశారు. విజువల్స్ పరంగా శ్రీ సాయికుమార్ దార తన కెమెరా యొక్క పనితనాన్ని చాలా అద్భుతంగా చూపించారు. అదే విధంగా ట్రైలర్ లో వినిపించిన మ్యూజిక్ ను మ్యూజిక్ డైరెక్టర్ శరవణ వాసుదేవన్ చాలా బాగా కంపోజ్ చేస్తూ సినిమాలో ఉండే నేపధ్యగానం పై మరింత ఆసక్తిని పెంచుతున్నారు. ఈ సినిమా యొక్క ట్రైలర్ కి ముఖ్యంగా ఎడిటింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక డైరెక్టర్ రామ్ గన్ని అయితే బయట నిజంగానే జైలర్ అంట. మరి సినిమాల్లోనికి రావాలని ఎందుకు అనిపించిందో గాని, నిజంగానే ఇలాంటి ప్రొఫెషనల్స్ ఇండస్ట్రి కి రావాలి, అప్పుడు సినిమాల్లో వాస్తవికత చాలా బాగుంటుంది.

నటీనటులు – స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – శ్రీ సాయికుమార్ దారా
ఎడిటర్ – శ్రీకాంత్ పట్నాయక్. ఆర్
సంగీతం – శరవణ వాసుదేవన్
బ్యానర్స్ – ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్
కో ప్రొడ్యూసర్ – సుదర్శన్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ – స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం – రామ్ గన్ని

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

11 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago