హీరో నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’లో దేశం గర్వించేలా చేసిన టెక్నిషియన్ వర్క్ చేస్తున్నారు. బాహుబలి, RRR వంటి అనేక ఎపిక్ మూవీస్ కి పని చేసిన మాస్టర్ సినిమాటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్ ‘స్వయంభూ’లో తన మ్యాజిక్ చూపించనున్నారు.
మేకర్స్ విడుదల చేసిన వీడియోలో చూపిన విధంగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ఈ టాప్ టెక్నిషియన్ ఇప్పటికే టీంలో చేరారు. మ్యాసీవ్ సెట్స్ తో గ్రాండ్ గా ఈ చిత్రం రూపొందుతోందని మేకింగ్ వీడియో చూస్తే అర్ధమౌతోంది. నిఖిల్‌కి ఇప్పటి వరకు మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ సినిమా ఇదే.
కెకె సెంథిల్ కెమెరా డీవోపీగా చేయడంతో సినిమాలోని విజువల్స్ టాప్ నాచ్‌గా ఉండబోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన మ్యాసీవ్ సెట్‌లో జరుగుతోంది.
నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా నిఖిల్ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ నిఖిల్‌ను సవ్యసాచిలా రెండు కత్తులతో, యుద్ధంలో శ్రతువులతో పోరాడుతున్న లెజండరీ వారియర్ గా ప్రజెంట్ చేస్తోంది. మెరూన్ కలర్ కాస్ట్యూమ్ ధరించి, పొడవాటి జుట్టు, మెలితిప్పిన మీసాలు, గడ్డం, మజల్ద్ ఫిజిక్, బైసప్స్ తో బీస్ట్ మోడ్ లో కనిపించారు నిఖిల్.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీ. ఇందులో లెజెండరీ వారియర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. క్యారెక్టర్ కోసం వెపన్స్, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. KGF, సాలార్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా, M ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్.
రిచ్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
నటీనటులు: నిఖిల్, సంయుక్త, నభా నటేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్, శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
సంగీతం: రవి బస్రూర్
డీవోపీ: KK సెంథిల్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాహరన్
సహ నిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జిటి ఆనంద్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…