తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అనే ఒక్క భీజాక్షరంలో ‘హ’, ‘ర’, ‘ఈ’, ‘మ’ అనే అక్షరాలున్నాయి. హ అంటే ధర్మం, ర అంటే అర్థం, ఈ అంటే కామం, మ అంటే మోక్షం..‘హ్రీం’ అంటే దర్మార్ధ కామ మోక్షాలు కలగలిసిన భీజాక్షరం. ఇప్పటివరకు ఎక్కడా చెప్పని ఒక యదార్థ గాధను ఆధారంగా తీసుకుని ఈ చిత్రానిన తెరకెక్కించారు.
శివమ్‌మీడియా పతాకంపై ‘హ్రీం’ అనే భీజాక్షరంతో తయారైన ఈ సినిమాలో నూతన నటీనటులు పవన్ తాత, డాక్టర్ చమిందా వర్మ జంటగా నటించారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వరంగల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘ హ్రీం’ చిత్రానికి రాజేష్ రావూరి దర్శకుడు. శ్రీమతి సుజాత మల్లాల సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివమల్లాల నిర్మాత.
వరంగల్ దగ్గరలోని పెద్ద పెండ్యాల గ్రామంలో తొలి షెడ్యూల్, హైదరాబాద్ హెచ్‌యంటీ కాలనీలోని ఫారెస్ట్ లొకేషన్స్‌లో సెకండ్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కీలక పాత్రల్లో ప్రముఖ నటులు తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రం, అనింగి రాజశేఖర్ (శుబోదయం సుబ్బారావు), త్రిపురనేని శ్రీవాణి, పూజారెడ్డి, వనితా రెడ్డి తదితరులు నటించారు.
కథ–కథనం–దర్శకత్వం – రావూరి రాజేష్
నిర్మాత– శివ మల్లాల
కెమెరా– అరవింద్, సంగీతం– మార్కస్.యం
ఎడిటింగ్–డిఐ– వైఎస్‌ఎస్ శివప్రకాశ్ ఆర్ట్æ– సుధీర్ మాచర్ల ‘క’ ఫేమ్ వీ.ఎఫ్.ఎక్స్ డైరెక్టర్– రాజ్ పవన్ కొమ్మోజు
పి.ఆర్.వో– మూర్తి మల్లాల
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…