రొటిన్ భిన్నంగా, కొత్త కంటెంట్‌తో చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్ అండ్ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో వున్నాం అంటున్నారు దర్శకుడు ప్రకాష్ దంతులూరి . ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘యేవమ్’ చాందిని చైదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ప్రతి ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఏది మంచి..ఏది కాదు అనే ర్యాప్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ
మహిళ సాధికారికతను చాటి చెప్పే నేపథ్యంలో ఈ సినిమా వుంటుంది.
చిత్రంలోని ప్రతి పాత్ర ఎంతో మినింగ్‌ఫుల్‌గా, కొత్తగా వుంటుంది. ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ఒక మార్క్ వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్, సంగీతం కీర్తన శేషు, నీలేష్ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…