టాలీవుడ్

‘మనమే’ స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ వున్న బ్యూటీఫుల్ ఎంటర్ టైనింగ్ ఫిల్మ్.

డైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ ‘మనమే’ తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి రెడీగా వున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ‘మనమే’ జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ కృతి శెట్టి మూవీ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.  

‘మనమే’లో మీ క్యారెక్టర్ ఎలా వుండబోతోంది ?
-ఇందులో నా క్యారెక్టర్ పేరు సుభద్ర. ఇప్పటి వరకూ నేను చేసిన క్యారెక్టర్స్ కి డిఫరెంట్ గా వుంటుంది. నాకు చాలా కొత్తగా వుంటుంది. ఇప్పటివరకూ క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేశాను. కానీ ఈ క్యారెక్టర్ చాలా స్ట్రిక్ట్ గా వుంటుంది. షూటింగ్ సమయంలో డైరెక్టర్ శ్రీరామ్ గారిని ఇంత స్ట్రిక్ట్ గా వుంటుందా?! అని చాలా సార్లు అడిగాను. ఆయన అంత స్ట్రిక్ట్ గా కావాలని చెప్పారు. ఆయన విజన్ ని ఫాలో అయ్యాను.

సుభద్ర పాత్రకు మీకు పోలికలు ఉన్నాయా ?
-పర్శనల్ గా నాకు పెద్ద కోపం రాదు. పెద్దగా అరవను. చాలా కామ్ గా వుంటాను. సుభద్ర క్యారెక్టర్ నాకు పూర్తిగా కొత్త.

టీజర్ లో బేబీ కనిపిస్తోంది. ఇందులో మదర్ గా కనిపిస్తారా ?
-అది తెలీదు. మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది(నవ్వుతూ). సినిమా చూసినప్పుడే నా క్యారెక్టర్ ఏమిటనేది పూర్తిగా తెలుస్తుంది.

శర్వానంద్ గారితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా వుంది ?
– శర్వానంద్ గారు వన్ అఫ్ ది ఫైనెస్ట్ పెర్ఫార్మర్. నిన్న సినిమా చూశాను. ఆయన ప్రతి సీన్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆయన ఎక్స్ పీరియన్స్ కనిపించింది. ఇందులో నాకు ఓ ఫేవరట్ సీన్ వుంది. ఆ సీన్ కోసం చాలా వెయిట్ చేశాను. ఎలా చేయాలో అని చాలా అలోచించాను. కానీ శర్వానంద్ గారు చాలా కాజ్యువల్ గా వచ్చి ఆ సీన్ ని ఒక్క నిమిషంలో అద్భుతంగా ఫినిష్ చేశారు. నేను స్టన్ అయిపోయాను.

-శర్వానంద్ గారి పెర్ఫార్మెన్స్ ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంటుంది. అందులో ఒక బేబీ కూడా వుంది. బేబీ తో షూట్ చేయడం అంత ఈజీ కాదు. అయితే శర్వానంద్ గారు చాలా బ్యూటీఫుల్ గా హ్యాండిల్ చేశారు. చాలా సపోర్ట్ చేశారు.

డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారు కథ చెప్పినపుడు మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి ?
-మనమే స్ట్రాంగ్ ఎమోషన్ కనెక్ట్ వున్న ఎంటర్ టైనింగ్ ఫిల్మ్. ఇందులో వండర్ ఫుల్ కిడ్, పేరెంట్ ఎమోషన్ వుంది. అది గ్లోబల్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా మా ముగ్గురి క్యారెక్టర్స్ చుట్టూ వుంటుంది. అందుకే మనమే అనే పేరు పెట్టాం. ఇది పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రతి సీన్ లో ఎంటర్ టైన్మెంట్ వుంటుంది.

ఉప్పెనలో బేబమ్మ క్యారెక్టర్ కి వచ్చిన రెస్పాన్స్, ఇందులో సుభద్ర క్యారెక్టర్ కి వస్తుందా?
-రావాలనే కోరుకుంటున్నాను. అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపైనే వుంటుంది. ఉప్పెన రస్టిక్ లవ్ స్టొరీ. మనమే ఒక రొమ్-కాం. మనమే లో నా క్యారెక్టర్ లో మంచి ఎమోషన్ వుంది. అది ప్రేక్షకులుకి నచ్చుతుందనే ఆశిస్తున్నాను.

మనమేలో మ్యూజిక్ ఎలా వుంటుంది ?
-హేశం గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ ఆకట్టుకుంటాయి. టప్పా టప్పా మంచి డ్యాన్స్ నెంబర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది.  

ఈ సినిమా మేజర్ పార్ట్ ఎబ్రాడ్ లో షూట్ చేయడం ఎలా అనిపించింది?
-లండన్ లో షూట్ చేశాం. లండన్ వెదర్ చాలా అన్ ప్రెడిక్టిబుల్ గా వుంటుంది.  మేము షూట్ చేసిన హౌస్ లో చాలా విండోస్ వుంటాయి. ఒక ఫ్రేం సెట్ చేశాక లైట్ మారిపోతుంది. సడన్ గా వర్షం పడుతుంది. మళ్ళీ లైట్ వచ్చేవరకూ వెయిట్ చేయాలి. ఇది చాలా డిఫికల్ట్ ప్రాసస్.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో పని చేయడం ఎలా అనిపించింది ?
– చాలా పాషన్ వున్న ప్రొడ్యూసర్స్. లండన్ లో వున్నప్పుడు చాలా కేర్ తీసుకున్నారు. విశ్వప్రసాద్ గారు చాలా స్వీట్.

సక్సెస్ ఫెయిల్యూర్స్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ?
-సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో వుండదు. మన చేతిలో లేని విషయాలు గురించి ఎక్కువగా ఆందోళన చెందకూడదని ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను.

మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనీ వుంటుంది ?
-నాకు ప్రిన్సెస్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. బాహుబలి లో అనుష్క గారి లాంటి క్యారెక్టర్స్. అలాగే యాక్షన్ , మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ వున్న రోల్స్ చేయాలని వుంది.

అప్ కమింగ్ ఫిల్మ్స్ ?  
-మూడు తమిళ్ ఫిలిమ్స్ చేస్తున్నాను. అలాగే టోవినో థామస్ తో ఒక మలయాళం ఫిల్మ్ చేస్తున్నాను.

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ

Tfja Team

Recent Posts

Deccan Sarkar Movie Poster and Teaser Launch

Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…

20 minutes ago

‘దక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్

హైద‌రాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…

21 minutes ago

సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ “కిల్లర్”

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…

1 hour ago

Second Schedule of Sci-Fi Action Killer has been wrapped up

Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…

1 hour ago

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు…

19 hours ago

Allu Aravind Visits Sri Tej After Telangana Government’s Permission

Renowned producer Allu Aravind visited actor Sri Tej, who is currently receiving treatment at KIMS…

20 hours ago