ఫిలింనగర్ లో ఘనంగా నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 101 వ జయంతి వేడుకలు

ఫిలింనగర్ లో ఘనంగా నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 101 వ జయంతి వేడుకలు మరియు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మరియు కుటుంబ సభ్యులు చేతుల మీదుగా ఘనంగా అన్నదాన కార్యక్రమం

నేడు విశ్వవిఖ్యాత పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 101 వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు మరియు తెలుగు సినీ ప్రముఖుల తో ఫిలింనగర్ లో ఎన్టీఆర్ గారి విగ్రహం వద్ద జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ప్రముఖులందరూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ నందమూరి మోహన్ కృష్ణ గారు, నందమూరి మోహన్ రూప గారు, ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపీనాథ్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ శ్రీ కె. ఎల్. దామోదర్ ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ ప్రసన్న కుమార్ గారు, ఫిలింనగర్ కల్చరల్ కమిటీ సెక్రటరీ శ్రీ మోహన్ ముళ్లపూడి గారు, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ శ్రీ వెల్దండ వెంకటేష్ గారు, యూసఫ్ గూడా కార్పొరేటర్ శ్రీ బండారి రాజ్ కుమార్ పటేల్ గారు, బిజెపి కార్యదర్శి శ్రీ చంద్ర మధు గారు మరియు కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ గారు విగ్రహానికి పూలమాలతో సత్కరించి జోహార్ ఎన్టీఆర్ నినాదాన్ని గట్టిగా వినిపించారు. కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి నందమూరి తారక రామారావు గారి 101 వ జయంతి వేడుకలు ఘనంగా జరిపించారు.

ఈ సందర్భంగా నందమూరి మోహన్ కృష్ణ గారు మాట్లాడుతూ : మా నాన్నగారు ఎన్టీఆర్ గారు ఎందరికో స్ఫూర్తిదాయకుడు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు పలు సంచలనాలకు స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తిదాయక వ్యక్తి 17 వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇటు సినీ రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ ఎన్నో పెను సంచలనాలు సృష్టించారు. సినీ ఇండస్ట్రీలో ఆయన వేయని పాత్ర అంటూ లేదు. ఆయన తెలుగువారి ఆత్మగౌరవం కాపాడాలని తెలుగుదేశం పార్టీని స్థాపించారు. రాజకీయంగా ప్రజలకు ఎంతో సేవ చేశారు. అలాంటి వ్యక్తి ఎప్పటికీ మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అని అన్నారు.

ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపీనాథ్ గారు మాట్లాడుతూ : ఎన్టీ రామారావు గారి 101 వ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎన్టీఆర్ గారి కుటుంబం మోహన్ కృష్ణ గారికి మోహన్ రూప గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఎన్టీఆర్ గారు విగ్రహం ఇక్కడ పెట్టడానికి ప్రసన్నకుమార్ గారు మోహన్ కృష్ణ గారు చాలా కష్టపడ్డారు. దేవుడు రూపంలో కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ గారు మనతో ఉన్నట్టుగా భావించే విగ్రహం ఇప్పటికే కాదు ఇంకొక 300 అయినా ఈ విగ్రహం ఇలాగే ఉంటుంది. అటు సినీ ఇండస్ట్రీలో ఇటు రాజకీయంగాను ఎన్నో సంచలనాలు సృష్టించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన భౌతికంగా మనతో లేకపోయినా అని ఆశీస్సులు ఎప్పుడూ మనపై ఉండాలని ఉంటాయని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నందమూరి మోహన రూపా గారు మాట్లాడుతూ : పూజ్యులు మా తాతగారు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విచ్చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు. తెలుగువారి ఖ్యాతిని తెలియజేయడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రపంచానికి తెలుగువారిని పరిచయం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా రాజకీయంగా పార్టీ పెట్టి ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆయన వేని పాత్ర అంటూ ఏదీ లేదు గాడ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ప్రతిష్టకు ఎక్కారు. ఒక రాముడు అన్న ఒక కృష్ణుడు అన్న మనకు గుర్తొచ్చే రూపం నందమూరి తారకరామారావు గారు. అలాంటి వ్యక్తి మా తాత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ పాదాభివందనాలు చేస్తున్నాను అని అన్నారు.

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

2 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago