ప్రెజెంటింగ్ వెడ్డింగ్ సాంగ్‌ అఫ్ ది ఇయర్- ‘మనమే’ నుంచి టప్పా టప్పా పాట విడుదల

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో శర్వానంద్ ‘మనమే’ మేకర్స్ ప్రమోషన్స్ డోస్ పెంచారు. మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి రెండు పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ రోజు మేకర్స్ మూడవ సింగిల్ టప్పా టప్పా పాట ని విడుదల చేశారు

ఈ పాటను ఈ సంవత్సరం పెళ్లి పాటగా ప్రమోట్ చేస్తున్నారు, ఈ అందమైన పాటను విని, కలర్ విజువల్స్ చూసిన తర్వాత అందరూ దీనిని అంగీకరిస్తున్నారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ అందరూ ఎంజాయ్ చేసే పర్ఫెక్ట్ వెడ్డింగ్ సాంగ్ ని అందించారు. ప్రోగ్రామింగ్, ఆర్కెస్ట్రేషన్ అద్భుతంగా ఉన్నాయి. రామ్ మిరియాల, హేశం తమ వోకల్స్ తో మెస్మరైజ్ చేయగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం గుర్తుండిపోతుంది.

శర్వానంద్ ఈ పాటలో లైవ్లీగా కనిపించారు. అతని స్టైలింగ్, డ్యాన్స్ అలరించాయి. పాటలో గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ కనిపించారు. ఇందులో కృతి శెట్టి, కిడ్ విక్రమ్ ఆదిత్య కూడా కనిపిస్తారు. శివ కందుకూరి, అయేషా ఖాన్ పెళ్లి జంటగా కనిపించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫర్లు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రానికి డైలాగ్స్‌ని అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ అందించారు.

‘మనమే’ జూన్ 7న థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
ప్రొడక్షన్: రామ్సే స్టూడియోస్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కృతి ప్రసాద్,  ఫణి వర్మ
అసోసియేట్ ప్రొడ్యూసర్: ఏడిద రాజా
డైలాగ్స్: అర్జున్ కార్తిక్, ఠాగూర్,  వెంకీ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
డీవోపీ: విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: జానీ షేక్
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

4 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

4 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

4 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

4 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

4 days ago