గ్రాండ్ గా “లవ్ రెడ్డి” టీజర్ లాంచ్ ఈవెంట్ !

గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్, బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లవ్ రెడ్డి. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని అక్టోబర్ 18న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్ర కర్ణాటక బాడర్ లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో స్మరన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మాతలుగా సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా ఈ సినిమాను నిర్మించారు.

తాజాగా చిత్ర యూనిట్ లవ్ రెడ్డి టీజర్ ను విడుదల చేశారు. టీజర్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

హీరో అంజన్ రామచంద్ర మాట్లాడుతూ…
మీడియా మిత్రులు మా లవ్ రెడ్డి సినిమా టీజర్ విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది, ఈ సినిమా తప్పకుండా సెన్సేషనల్ సృష్టిస్తుంది. మంచి సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకం ఉంది, అందరిలాగే మేము కష్టపడి చేశాము, ఆడియన్స్ సినిమా చూశాక తప్పకుండ ఈ సినిమాతో కొంతకాలం జర్నీ చేస్తారు, సినిమా ఎండింగ్ లో ఒక గొప్ప ఫీల్ తో బయటికి వస్తారు, అక్టోబర్ 18న మా సినిమాను సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.

డైరెక్టర్ స్మరన్ మాట్లాడుతూ…
ఎంకరేజ్ చేస్తున్న ప్రెస్ పీపుల్ కు కృతజ్ఞతలు, లవ్ రెడ్డి సినిమా ఇంతవరకు వచ్చింది అంటే అందుకు కారణం హీరో అంజన్ రామచంద్ర, మా మధ్య చాలా జర్నీ ఉంది, మేము కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేశాము, ఇప్పుడు సినిమాతో మీ ముందుకు వస్తున్నాను, హీరోయిన్ శ్రావణి చాలా బాగా నటించింది, అందరూ కష్టపడి చేసిన సినిమా ఇది, సన్నీ సంగీతం, వరప్రసాద్ కెమెరా వర్క్ బాగుంది, అలాగే మోహన్ చారి, అస్కర్ ఆలీ ఈ సినిమాకు కెమెరామెన్స్ గా వర్క్ చేశారు, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు గారు సపోర్ట్ మర్చిపిలేనిది, మైత్రి వారు మా సినిమాను రిలీజ్ చెయ్యడం సంతోషంగా ఉందని అన్నారు.

నిర్మాత మదన్ మాట్లాడుతూ…
ఈ సినిమా హీరో అంజన్ రామచంద్ర, డైరెక్టర్ స్మరన్ జర్నీ పది ఏళ్ల నుండి ఉంది, వారిద్దరూ కలిసి చేస్తున్న సినిమా లవ్ రెడ్డి, మంచి కంటెంట్ తో వస్తోన్న సినిమా ఇది, అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

హీరో: అంజన్ రామచంద్ర
హీరోయిన్: శ్రావణి రెడ్డి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: స్మరన్ రెడ్డి
నిర్మాతలు: సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి
సహా నిర్మాతలు: సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవీంద్ర రెడ్డి
సంగీతం: ప్రిన్స్ హేన్రి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

10 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago