“గం..గం..గణేశా”లో ఆనంద్ దేవరకొండ పర్ ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ ఉదయ్ శెట్టి.

  • నేను విజయేంద్రప్రసాద్ గారి టీమ్ లో రైటర్ గా వర్క్ చేసేవాడిని. ఒకసారి హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ టైమ్ లో ఈ స్టోరీ లైన్ ఫ్లాష్ అయ్యింది. నా ఫ్రెండ్, దర్శకుడు అనుదీప్ కేవీ ద్వారా ఆనంద్ దేవరకొండ టీమ్ కు ఈ స్క్రిప్ట్ సినాప్సిస్ పంపించాను. ఆ సాయంత్రమే నాకు ఫోన్ వచ్చింది. వచ్చి ఒకసారి కలవండి అని. నేను వెళ్లి స్క్రిప్ట్ గురించి వాళ్లకున్న డౌట్స్ క్లియర్ చేశాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేద్దామని ఆనంద్ చెప్పారు. అలా “గం..గం..గణేశా” జర్నీ బిగిన్ అయ్యింది.
  • ఆనంద్ దేవరకొండ ఇప్పటిదాకా బాయ్ నెక్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. సాఫ్ట్ నేచర్ రోల్స్ లో కనిపించాడు. “గం..గం..గణేశా”లో హీరో క్యారెక్టర్ గ్రే షేడ్స్ లో ఉంటుంది. చాలా ట్రిక్కీ క్యారెక్టర్ హీరోది. ఫంకీగా ఉంటాడు ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. ఇలాంటి క్యారెక్టర్ ఆనంద్ కు కొత్తగా ఉంటుంది. ఎందుకంటే అతను ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటిదాకా చేయలేదు. అతనే కరెక్ట్ ఆప్షన్ అనిపించింది. అలా ఆనంద్ ను అప్రోచ్ అయ్యాను.
  • వినాయకుడి విగ్రహం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ విగ్రహం సంపాదించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటాడు. ఈ సినిమాలో అన్నీ గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక హీరోయిన్ ని మాత్రం మంచి క్యారెక్టర్ లో చూపిస్తున్నాం. మరో హీరోయిన్ నెగిటివ్ గా బిహేవ్ చేస్తుంది. అయితే తను బ్యాడ్ కాదు పరిస్థితుల వల్ల అలా ప్రవర్తించాల్సివస్తుంది.
  • హైదరాబాద్ నేపథ్యంగా మొదలయ్యే ఈ సినిమా ఆ తర్వాత కర్నూల్ కు షిప్ట్ అవుతుంది. ఈ జర్నీలో సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ హిలేరియస్ గా వచ్చింది. ఇటీవల మా మూవీ ప్రివ్యూ చూసిన వాళ్లు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఇంకాస్త సేపు ఉంటే బాగుండేది అన్నారు. వాళ్లకు అంతగా నచ్చింది. ఇందులో స్పెషల్ గా లవ్ స్టోరి అంటూ ఉండదు. కథ జర్నీలో భాగంగా ఇద్దరు హీరోయిన్స్ వస్తారు. వాళ్లకు కీ రోల్స్ ఉన్నాయి. బాగా నయన్ సారిక, ప్రగతి శ్రీ వాస్తవ బాగా పర్ ఫార్మ్ చేశారు.
  • “గం..గం..గణేశా” సినిమాలో స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. కథలో నేను నమ్మిన ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ను అలాగే హోల్డ్ చేస్తూ స్క్రీన్ ప్లే సాగుతుంది. ఈ సినిమా మరో రెండేళ్లకు తెరపైకి తీసుకొచ్చినా కొత్తగా ఉంటుంది. అలాంటి స్క్రీన్ ప్లే కుదిరింది. “గం..గం..గణేశా” మేకింగ్ టైమ్ లో ఆనంద్ చాలా సపోర్ట్ చేశాడు. నేను అనుకున్న క్యారెక్టర్ లో బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఎడిట్ టేబుల్ మీద ఆనంద్ పర్ ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. డైలాగ్ డెలివరీ, టైమింగ్, రియాక్షన్స్ చాలా బాగా చేశాడు. ఈ సినిమాకు ఆయన పర్ ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. కమర్షియల్ హీరోకు ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఆయన క్యారెక్టర్ లో కనిపిస్తాయి.
  • భయం, అత్యాశ, కుట్ర అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి. అయితే కొందరిలో కొంత మరికొందరిలో ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు లక్షణాలు కొందరు మనుషులను ఎలాంటి పరిస్థితుల వైపు తీసుకెళ్లాయి అనేది “గం..గం..గణేశా”లో ఆసక్తికరంగా తెరకెక్కించాం. నేను ఈ ప్రాజెక్ట్ కోసం వెళ్లేప్పటికే బేబి సినిమా షూట్ కు అయ్యి ఉంది. ఆ తర్వాత సమాంతరంగా “గం..గం..గణేశా” బేబి షూటింగ్ చేశాం. బేబిలో ఎమోషనల్ కంటెంట్, మా మూవీలో ఎనర్జిటిక్, కామెడీ క్యారెక్టర్ ఆనంద్ చేయాలి. ఈ రెండు సినిమాల మధ్య షిప్టింగ్ ఆనంద్ కు ఛాలెంజింగ్ గా ఉండేది. బేబి సినిమా సక్సెస్ తర్వాత మా మూవీ రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. ఆనంద్ సినిమాలకు ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారు. “గం..గం..గణేశా” సినిమాను కూడా త్వరగా థియేటర్స్ లో చూడాలి అనే క్యూరియాసిటీ వారిలో ఏర్పడుతోంది.
  • విజయేంద్రప్రసాద్ గారి పుట్టినరోజు విష్ చేసేందుకు వెల్తే “గం..గం..గణేశా” కథను మరోసారి చెప్పించుకుని విని బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాతో హిట్ కొడుతున్నావ్ అని బ్లెస్ చేశారు. ఆయనకు మా కథ నచ్చడం నాలోని కాన్ఫిడెన్స్ పెంచింది. ఆనంద్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా “గం..గం..గణేశా” సినిమా చూశారు. వాళ్లకు మూవీ బాగా నచ్చింది.
  • నేను పూరి జగన్నాథ గారిని చూసి ఇన్స్ పైర్ అయ్యాను. అయితే రాజమౌళి గారి సినిమాల్లోని డ్రామా చాలా ఇష్టం. మనకు సినిమా చూసేప్పుడు డ్రామా మన మనసులకు రీచ్ అవుతుంది. అలాంటి యాక్షన్ డ్రామా మూవీస్ చేయాలని ఉంది. నా నెక్ట్ మూవీ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది.
Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

20 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago