సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన, ఏకే ఎంటర్టైన్మెంట్స్,#SK30 షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

Must Read

సందీప్ కిషన్ తన ల్యాండ్‌మార్క్ 30వ మూవీ #SK30 కోసం”ధమాక” డైరెక్టర్ త్రినాధరావు నక్కినతో జతకట్టారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజేష్ దండా ఈ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాత.  

ఇటీవలే గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమా ఇప్పుడు హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ హ్యుజ్ స్కేల్ లో రూపొందుతోంది. లవ్ అండ్ ఎమోషన్ తో నిండిన హార్ట్ వార్మింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.

బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌లను తీసుకురావడంలో పేరుపొందిన త్రినాధరావు నక్కిన, సందీప్ కిషన్‌ని కంప్లీట్ డిఫరెంట్ అవతార్‌లో ప్రజెంట్ చేస్తున్నారు. అతని క్యారెక్టరైజేషన్ కంప్లీట్ రిఫ్రెషింగా వుంటుంది.

త్రినాధ రావు నక్కినతో సక్సెస్ ఫుల్ పార్ట్నర్షిప్ వున్న  రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , డైలాగ్‌లను రాశారు. ఈ మూవీ వారి కాంబో నుంచి సిగ్నేచర్ ఎంటర్టైనర్ అవుతుంది.

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.  నిజార్ షఫీ డీవోపీ కాగ , చోటా కె ప్రసాద్ ఎడిటర్. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్,

నటీనటులు: సందీప్ కిషన్, రావు రమేష్

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్
నిర్మాత: రాజేష్ దండా
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
సంగీతం: లియోన్ జేమ్స్
డీవోపీ: నిజార్ షఫీ
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా

Latest News

Vishnu Led Taranga Ventures in Final Talks with Will Smith for $50 Million Media Fund

Mumbai, December 13, 2024 – Taranga Ventures, a media and entertainment tech fund spearheaded by actor-producer Vishnu Manchu, is...

More News