వయనాడ్ బాధితులకు రెబెల్ స్టార్ ప్రభాస్ 2 కోట్ల రూపాయల విరాళం

Must Read

సమాజంలో ఏ విపత్తు జరిగినా తక్షణమే స్పందిస్తుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. పెద్ద మనసుతో భారీగా విరాళం ఇస్తుంటారు. కేరళలోని వయనాడ్ లో జరిగిన ప్రకృతి విపత్తు బాధితులకు ఆపన్నహస్తం అందించారు ప్రభాస్. వయనాడ్ బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.

కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఈ విరాళం అందిస్తున్నారు ప్రభాస్. వయనాడ్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రభాస్ తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలని, వారికి మనమంతా అండగా ఉండాలని ప్రభాస్ కోరారు.

Latest News

‘బద్మాషులు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందున్న హిలేరియస్ ఎంటర్టైనర్ ‘బద్మాషులు’. తార స్టొరీ టెల్లర్స్...

More News