పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో మత్తువదలరా, సేనాపతి చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబిషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న చిత్రం 'దిల్ వాలా'.క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైయింది. చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో మెరిసే మెరిసే ఫేమ్ శ్వేత అవస్తి కథానాయికగా నటిస్తున్నారు. మెలోడీ స్పెషలిస్ట్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ప్రసాద్ ఎడిటర్ గా, అనిత్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. తారాగణం: హీరో: నరేష్ అగస్త్య, శ్వేత అవస్తి, రాజేంద్ర ప్రసాద్, అలీ రాజా, దేవ్ గిల్ , అలీ పోసాని, బ్రహ్మజీ, రఘుబాబు, సుదర్శన్, భద్రం, కాశీ విశ్వనాథ్, గెటప్ శ్రీను, మాణిక్, గోవిందరావు, గోవర్ధన్, ఎస్తార్, ప్రగతి, లయ, లహరి, హిమజ, శిరీష తదితరులు టెక్నికల్ టీమ్ : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:వీరభద్రమ్ చౌదరి నిర్మాతలు: నబీషేక్, తూము నర్సింహా పటేల్ బ్యానర్స్ : డెక్కన్ డ్రీమ్ వర్క్స్ సంగీతం: అనూప్ రూబెన్స్ మాటలు: శంకర్ కెమరా : అనిత్ ఆర్ట్ డైరెక్టర్ : ఉపేంద్ర ఎడిటర్ : చోటా కె ప్రసాద్ కో డైరెక్టర్ : రమేష్ రెడ్డి పూనూరు పీఆర్వో : వంశీ- శేఖర్