తనదైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మాస్ మహారాజా రవితేజ. స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన…
Mass Maharaaj of South Indian Cinema, Ravi Teja has been a symbol of infectious energy and dominating screen presence for…
స్కంద’ చిత్రం కన్నుల విందుగా వుంటుంది. ఖచ్చితంగా సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది: స్కంద ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్ లో నటసింహ నందమూరి…
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ‘స్కంద’ ప్రీ రిలీజ్ థండర్ ఆగస్టు 26న విడుదల…
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ #BoyapatiRAPO ఫస్ట్ థండర్ మే 15న విడుదల బ్లాక్…
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. "ధమాకా" ఆల్బమ్ లోని జింతాక్ పాట మాస్ చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా జింతాక్ పాట 26 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సెన్సేషనల్ సాంగ్ గా అలరిస్తోంది. భీమ్స్ సిసిరోలియో మాస్ డ్యాన్స్ ట్యూన్ గా కంపోజ్ చేసిన ఈ పాటకు అన్ని వర్గాల నుండి ట్రెమండస్ రెస్పాన్ వస్తోంది. ప్రతి రెండు రోజులకు వన్ మిలియన్ వ్యూస్ పెంచుకుంటూ యూట్యూబ్, మ్యూజిక్ ఫ్లాట్ ఫామ్స్ లో దూసుకుపోతుంది జింతాక్ సాంగ్. జింతాక్ పాటలో రవితేజ మాస్ డ్యాన్సులు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేశాయి. రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ ఈ పాటని ఎనర్జీటిక్ గా పాడగా, కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది.ఇటివలే చిత్ర యూనిట్ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ 'ధమాకా' చిత్రం విడుదల తేదిని ప్రకటించారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. తారాగణం: రవితేజ, శ్రీలీల సాంకేతిక విభాగం: దర్శకత్వం: త్రినాధరావు నక్కిన నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని ఫైట్స్: రామ్-లక్ష్మణ్ ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల పీఆర్వో: వంశీ-శేఖర్
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ధమాకా విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇటివలే విడుదలైన మాస్ క్రాకర్ టీజర్ సినిమా ట్యాగ్ లైన్ కి తగ్గట్టు ‘డబుల్ ఇంపాక్ట్’ క్రియేట్ చేసింది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. తారాగణం: రవితేజ, శ్రీలీల సాంకేతిక విభాగం: దర్శకత్వం: త్రినాధరావు నక్కిన నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని ఫైట్స్: రామ్-లక్ష్మణ్ ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల పీఆర్వో: వంశీ-శేఖర్
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాధరావు నక్కిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధమాకా' పాజిటివ్ వైబ్స్ తో దూసుకెళుతోంది. రవితేజ మార్క్ అవుట్ అండ్ అవుట్…
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ప్రస్తుతం కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తోంది. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ సౌత్‌లో తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషలలో విడుదల కానుంది.చిత్ర నిర్మాతలు ఇదివరకే కిరీటి రెడ్డిని పరిచయం చేస్తూ ఒక గ్లింప్స్ ని విడుదల చేసారు. ఈ వీడియోలో కిరిటీ తన నైపుణ్యం అందరినీ ఆకట్టుకున్నారు. ఇందులో ఎక్స్ ట్రార్డినరీ గా కనిపించారు కిరిటీ. స్టైలిష్‌గా కనిపించి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ మెప్పించారు. ఈ రోజు కిరిటీ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటిస్తూ మరో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి 'జూనియర్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ వీడియోలో ఈ తరం యువత గురించి, భవిష్యత్తు లక్ష్యాల గురించి ప్రతి జూనియర్‌కు ఉండే విశ్వాసం గురించి కిరిటీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.కిరిటీ రెడ్డి డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్‌తో తనదైన ముద్ర వేశారు. కాలేజీలో గోడకు ఆనుకుని ఫిడ్జెట్ స్పిన్నర్‌ను తిప్పుతూ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ గ్లింప్స్ కోసం ప్లజంట్ బీజీఎం స్కోర్ చేశారు. టైటిల్ గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విడుదల చేసిన కొద్దిసేపటికే 5 మిలియన్ వ్యూస్ ని క్రాస్ అందరినీ ఆకర్శిస్తోంది.లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వారాహి చలనచిత్రం ప్రొడక్షన్ నంబర్ 15 గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు ఉన్నారు. టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్స్ లో ఒకరైన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, జెనీలియా ఒక ముఖ్యమైన పాత్రతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ లెజెండ్ క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాహుబలి లెన్స్‌మెన్ కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ గా, భారతదేశపు అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. తారాగణం: కిరిటీ, శ్రీలీల, జెనీలియా, డాక్టర్ రవిచంద్ర వి తదితరులు సాంకేతిక విభాగం రచన, దర్శకత్వం: రాధా కృష్ణ నిర్మాత: సాయి కొర్రపాటి సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ డీవోపీ: కెకె సెంథిల్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్ స్టంట్ డైరెక్టర్: పీటర్ హెయిన్ పీఆర్వో: వంశీ-శేఖర్
మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన క్రేజీ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అన్ లిమిటెడ్ ఎంటర్‌టైనర్ "ధమాకా''. ఎనర్జీకి మారుపేరైన రవితేజ, కమర్షియల్ సబ్జెక్ట్‌లను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్న త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తోన్న ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన మొదటి పాట 'జింతాక్'కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ధమాకా చిత్ర యూనిట్ అదిరిపోయే కొత్త అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రం గ్లింప్స్ ఆగస్ట్ 31న విడుదల వినాయక చవితి సందర్భంగా సాయంత్రం 5:01 గంటలకు విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ కలర్ ఫుల్ గా, రొమాంటిక్ గా కనిపిస్తోంది. రవితేజ శ్రీలీలని తన దగ్గరికి తీసుకొని, ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తుండగా శ్రీలీల కాస్త టెన్షన్ పడుతూ అయోమయంగా చూడటం ఆకట్టుకుంది, అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ‘డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తారాగణం: రవితేజ, శ్రీలీల సాంకేతిక విభాగం: దర్శకత్వం: త్రినాధరావు నక్కిన నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని ఫైట్స్: రామ్-లక్ష్మణ్ ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల పీఆర్వో: వంశీ శేఖర్