Srikanth Odela

ఘనంగా జరిగిన సైమా- 2024 అవార్డ్స్ వేడుకలు

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2024 వేడుకలు దుబాయి వేదికగా ఘనంగా జరిగాయి.  దక్షిణాది భాషల సంబంధించిన అతిరథ మహారథులు ఈ వేడుకకు…

3 months ago

దసరా, హాయ్ నాన్న SIIMA, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో రికార్డ్ నామినేషన్‌లతో నాని గ్రేట్ అచీవ్మెంట్

నేచురల్ స్టార్ నాని వరుస బ్లాక్ బస్టర్స్‌ ఇచ్చే మోస్ట్ బ్యాంకబుల్ స్టార్లలో ఒకరు. నాని గత రెండు సినిమాలు- దసరా,  హాయ్ నాన్న  సెన్సేషనల్ సక్సెస్…

5 months ago

నాని, దసరా’ నాలుగో సింగిల్  ‘ఓ అమ్మలాలో’ విడుదల

నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచాయి. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ‘దసరా’ ఆల్బమ్ ఇప్పటికే చార్ట్ బస్టర్ అయ్యింది. దూమ్ ధామ్, ఓరి వారి, చమ్కీల అంగీలేసి పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్  వచ్చింది. ఈ రోజు దసరా నుంచి నాలుగో సింగల్ ‘ఓ అమ్మలాలో’ పాటని విడుదల చేశారు మేకర్స్.  ధరణి, వెన్నెల అందమైన బాల్యాన్ని చూపిస్తూ మనసుని హత్తుకునేలా ఈ పాటని స్వరపరిచారు సంతోష్ నారాయణ్. ఈ పాటకు రెహమాన్ అందించిన సాహిత్యం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాల్య మధుర స్మృతులని, మరపురాని జ్ఞాపకాలని ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. అనురాగ్ కులకర్ణి ఈ పాటని హార్ట్ టచ్చింగా ఆలపించారు. కీర్తి సురేష్ కథానాయిక నటించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించారు.  ప్రతిభావంతులైన ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సత్యన్‌ సూర్యన్‌ కెమరామెన్ గా పని చేసిన ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్,  నవీన్ నూలి ఎడిటర్ .  విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న దసరా మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ReplyForward

2 years ago

‘దసరా’ మేము ఊహించిన దానికంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది:   నాని

నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ కథానాయికగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులని నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న దసరా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సందర్భంగా హీరో నేచురల్ స్టార్ నాని విలేకరుల సమావేశంలో దసరా బ్లాక్ బస్టర్ విశేషాలని పంచుకున్నారు. దసరా విజయం ఎలా అనిపించిది ? సినిమా చూసిన వారంతా గొప్పగా స్పందిస్తున్నారు. విడుదలైనప్పటి నుంచి నా ఫోన్ మ్రోగుతూనే వుంది. మాట్లాడి చాలా కాలం అయిన వారు కూడా ఎమోషనల్ గా మెసేజ్ లు పెడుతుంటే.. దీని కోసమే సినిమా తీశాం కదా అనిపించిది. చాలా ఆనందంగా వుంది. దసరా లో చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్లు ఏవి ? దసరా లొకేషన్ లో ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్ ఏదీ లేదు. అన్నీ చాలా కష్టపడి  చేసిన సీన్లే. దుమ్ము, ధూళి, వేడి  మధ్య పని చేశాం. అయితే బాగా వస్తున్నాయని ఫీలింగ్ మాత్రం అన్ని సీన్లకి వుంది. థియేటర్ లో ఎలా వుంటుందో అని ఎక్సయిటెడ్ గా అనిపించింది మాత్రం దసరా క్లైమాక్స్. ప్రేక్షకులతో కలసి థియేటర్ లో చూడటానికి చాలా ఎక్సయిటెడ్ గా ఎదురుచూసాం. ఆన్ లైన్ ఎడిటింగ్ చూసినప్పుడే మేము షాక్ అయ్యాం. మీరు కంప్లీట్ రీరికార్డింగ్ తో చూసేసరికి ఆ ఇంపాక్ట్ ఇంకా పెరిగింది. రామ్ చరణ్ కు రంగస్థలం, అల్లు అర్జున్ కి పుష్ప.. మీకు దసరా అలా అని సోషల్ మీడియాలో  మాట్లాడుకుంటారు.. ఈ సినిమా మీలో నటుడికి తృప్తిని ఇచ్చిందా? నటుడిగా నేను ఆనందపడతాను. కానీ తృప్తి పడను. ఎప్పుడు తృప్తి పొందుతామో ఇంకా ప్రయత్నం చేయడంలో అలసత్వం వచ్చేస్తుంది. ఈ సినిమాకే కాదు.. ఏ సినిమాకి తృప్తి పడను. ఆనందం మాత్రం వుంటుంది. దసరా తో టీం అందరికీ  మంచి పేరు వచ్చింది. గ్రేట్ ఫీలింగ్. దసరా కథ విన్నప్పుడే దసరా కి ఇంత స్పాన్ వుందని అనుకున్నారా ? ఈ కథ విన్నప్పుడే ఇండస్ట్రీ లో బెస్ట్ టెక్నిషియన్స్ శ్రీకాంత్ కి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. సినిమా చేస్తున్నపుడే శ్రీకాంత్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని చెప్పాను. విడుదలకు ముందే చాలా ఈవెంట్స్ లో శ్రీకాంత్ పేరు గుర్తుపెట్టుకోండని చెప్పాను. మిగతా భాషలల్లో తీసుకురావాలని ఎప్పుడు నిర్ణయించారు ? కథ విన్నప్పుడే. ప్రేమ స్నేహం పగ యూనివర్శల్ గా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్. మన కల్చర్ ని సెలబ్రేట్ చేసుకునే సినిమా ఏదైనా దొరికితే అది అందరి దగ్గరకి తీసుకెళ్లడం మన బాధ్యత. ఈ సినిమా చేస్తున్నపుడు బతుకమ్మ తో పాటు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి కథ వచ్చినపుడు ఇది మా కల్చర్ చెప్పడం మన బాధ్యత. దినిని అక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కాంతారతో భూత్ కొళా అనేది కర్ణాటకలో వుందని దేశంలో అందరికీ తెలిసింది. ఇలా మన కల్చర్ ని చెప్పే అవకాశం వచ్చినపుడు దానిని అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మాస్ రస్టిక్ సినిమాలు నడుస్తున్నాయి కదా.. ఇలాంటి సినిమా కోసం ఇన్నాళ్ళు ఎదురుచూశారా ? నేను దేని కోసం ఎదురుచూడను. దసరా మాస్ సినిమా. పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా విడుదలకు ముందే దాని నుంచి బయటికి వచ్చేశాను. ఇప్పుడు ఆరేళ్ళ పాపకి తండ్రిగా ఓ సినిమా చేస్తున్న . నేను ఏ బ్రాకెట్ లో పడకూదని భావిస్తాను. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా సినిమాలు చేయలనేది నా ఆలోచన. జెర్సీ ఫ్యాన్స్ వున్నారు.. ఇప్పుడు దసరా ఫ్యాన్స్ వున్నారు.. వాళ్లకి సినిమా వుండాలి, వీళ్ళకి సినిమా వుండాలి. నటుడిగా ఈ వైవిధ్యం వుండాలి. దసరా కి నార్త్ నుంచి రెస్పాన్స్ ఎలా వుంది   ? చాలా అద్భుతంగా వుంది. చాలా గొప్ప రివ్యూలు వచ్చాయి. చూసిన వారంతా ఈ ఏడాది మా ఫేవరేట్ ఫిల్మ్ దసరా అని చెబుతున్నారు. మేము ఊహించినదాని కంటే అక్కడ ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. మేము ఊహించిన ఓపెనింగ్ వచ్చేసింది. దసరా కి వచ్చింది కొన్ని స్ట్రయిట్ హిందీ సినిమాలకి కూడా రాలేదు. రోజురోజుకి పెరుగుతోంది. మీ గత సినిమాల విజయాలకి మాస్ దసరా విజయానికి ఎలాంటి తేడా వుంది ? ఈ సినిమా విడుదలకు ముందు మీరు లవర్ బాయ్ కదా దసరా ఎలా వుంటుందని కొందరు అడిగారు. కానీ నా కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ దసరా, ఎంసిఏ, నేను లోకల్. మూడు మాస్ సినిమాలు. నేను ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే వున్నాను. నేను ఏది జోనర్ వారిగా చూడను. నచ్చితే చేసేస్తాను. మీకు కంఫర్ట్ ఫుల్ జోనర్ ?…

2 years ago

‘దసరా’ నిజాయితీగా తీసిన సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దసరా ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విలేఖరు సమావేశంలో దసరా విశేషాలని పంచుకున్నారు. మీ నేపధ్యం, సినిమా ప్రయాణం గురించి చెప్పండి ? మాది పెద్దపల్లి దగ్గర సింగరేణి కోటర్స్. మా నాన్నగారు సింగరేణి ఎంప్లాయ్. నేను టెన్త్ క్లాస్ లో వున్నప్పుడు సుకుమార్ గారి ‘జగడం‘ చూశాను. ఆ సినిమా నాపై చాలా ప్రభావం చూపింది. ఫిల్మ్ మేకింగ్ పై ఆసక్తి పెరిగింది. సుకుమార్ గారి దగ్గర చేరాలంటే నాకు మరో మార్గం లేదు. ఆయన ఇంటి ఎదురుగా నిలుచునే వాడిని. ఓ నాలుగేళ్ళు అలా గడిచాక ఒక రోజు ఆయన పిలిచి ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొని రమ్మని చెప్పారు. నేను చేసిన షార్ట్ ఫిల్మ్ ఆయనకి నచ్చింది. అలా ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేరాను. రంగస్థలం తర్వాత బయటికి వచ్చి ఈ కథని రాసుకున్నాను. అక్కడికి వెళ్దాం అనే గ్యాప్ లోనే సుధాకర్ గారు కథ విన్నారు. దసరా కథ ఆలోచన ఎప్పుడు వచ్చింది.. నాని గారి కోసమే రాసుకున్నారా ? దసరా నేను చిన్నప్పటి నుంచి విన్న కథ. నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనని ఆధారంగా చేసుకొని ఈ కథని రాసుకున్నా. తర్వాత నాని అన్న వచ్చారు. దసరాలో కనిపించే వీర్లపల్లి మా నాన్నమ్మ గారి ఊరు. నా బాల్యం అంతా అక్కడే గడిచింది. సెలవుల్లో అక్కడే గడిపేవాడిని.  ఆ ఊరి ప్రభావం నాపై చాలా వుంది. అక్కడ జరిగిన ఓ సంఘటన ఆధారంగా అల్లుకున్న కథ దసరా. నేను సుధాకర్ గారికి కథ చెప్పాను. ఆయన నాని అన్నకు చెప్పమన్నారు. అలా దసరా కాంబినేషన్ కుదిరింది. ‘దసరా’ ది తెలంగాణ నేపధ్యం. కీర్తి సురేష్ తో ఆ యాస చెప్పించడం కష్టంగా అనిపించిందా ? లేదండీ. కీర్తి సురేష్ గారిది సూపర్ బ్రెయిన్ పవర్. ఏదైనా చెబితే ఐదు నిమిషాల్లో పట్టేస్తుంది. పెద్ద ఒత్తిడి కూడా తీసుకోదు. ఇంత త్వరగా నేర్చుకుంటుంటే నేనే షాక్ అయ్యా. డబ్బింగ్ కూడా అద్భుతంగా చెప్పింది. దసరా పాన్ ఇండియా విడుదలౌతుంది కదా.. ఒత్తిడి ఉందా ? పాన్ ఇండియా అనే భయం లేదు. అయితే అన్ని భాషల్లో విడుదల చేస్తున్నపుడు అన్ని భాషల్లో క్యాలిటీ అవుట్ పుట్ ఇవ్వాలన్నదానిపైనే ద్రుష్టి పెట్టాను. ‘దసరా’ లో నాని గెటప్ కి అల్లు అర్జున్ పుష్ప పాత్ర స్ఫూర్తి ఏమైనా వుందా ? ’లేదండీ. 2018 దసరా రోజు నాని అన్నకు ఈ కథ చెప్పాను. అప్పుడే ఈ సినిమా టైటిల్ దసరా అని చెప్పాను. అప్పటికి పుష్ప ఫస్ట్ లుక్ బయటికి రాలేదు. సుకుమార్ గారు ఏం చేస్తున్నారో నాకు తెలీదు. లాంగ్ హెయిర్, గెడ్డం పెంచమని నాని అన్నకి చెప్పాను. ఆ రోజుస్కెచ్ వేసి లుక్ అని ఫిక్స్ అయ్యాం. పుష్ప వచ్చినపుడు కూడా .. ధరణి లుక్ ని మనం ముందే అనుకున్నాం కదా అని భావించాను. కానీ ఈ రెండికి పోలిక పెడతారని మాత్రం అనుకోలేదు. దసరాలో హీరోయిన్ గా తెలుగు అమ్మాయి అయితే బావుటుందని అనుకున్నారట ? అవునండీ. తెలుగు అమ్మాయి కోసం దాదాపు ఎనిమిది నెలలు వెదికా. దొరకలేదు. నేను తెలుగు అమ్మాయని చెప్పినపుడే దొరకరని నాని అన్న ముందే చెప్పారు. దసరాలో యాబై మందికి పైగా నటులని ఊర్ల నుంచి తెచ్చి వారికి శిక్షణ ఇచ్చి యాక్ట్ చేయించాం.   నాని గారి ఇంత మాస్ క్యారెక్టర్ లో ప్రేక్షకులు ఎలా యాక్సప్ట్ చేస్తారనే ఆలోచన వచ్చిందా ? ఇది డేరింగ్ స్టెప్ అనిపించలేదా ? నాకు ఇలాంటి లెక్కలు వుండవు, తెలీదు. నేను ఎంత నిజాయితీగా సినిమా తీశాననేదే లెక్క చేసుకుంటాను. నిజాయితీగా తీశాం కాబట్టి కథ కోణం నుంచే చూస్తారని భావిస్తున్నాను. మొదట అనుకున్న బడ్జెట్ కంటే దసరా స్కేల్ పెరిగింది కదా.. ? మొదటి షెడ్యుల్ పూర్తయిన తర్వాత బడ్జెట్ అనుకున్నదాని కంటే ఎక్కువౌతుందని నాని అన్న కి నాకు, నిర్మాత సుధాకర్ గారికి అర్ధమైయింది. అయితే నిర్మాత సుధాకర్ గారు ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. దాదాపు 90 శాతం షూటింగ్ సెట్ లో చేయడానికి కారణం ?…

2 years ago

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా  చిత్రం ‘దసరా’

The India Tour Promotion Understands That The Whole Country Looks Forward To Telugu Film Dussehra: Natural Star Nani

2 years ago

‘దసరా’కు  U/A సర్టిఫికేట్ –  పర్ఫెక్ట్ రన్‌టైమ్ లాక్

Natural Star Nani's Most Awaited Pan India Entertainer 'Dussehra' Has Grand Theatrical Release Worldwide on 30th March

2 years ago

దసరా’ నుంచి గూస్ బంప్స్ గ్లింప్స్

Wishing Natural Star Nani On His Birthday, The Makers Of Dasara Released A Mass-appealing Poster

2 years ago