Producer Dil Raju

The movie ‘Arya’ changed my life – Icon star Allu Arjun

Icon star Allu Arjun portrayed the titular role in the movie 'Arya,' marking creative genius Sukumar's directorial debut. Produced by…

8 months ago

Vijay Devarakonda,Dil Raju,Parasuram Surprise Visit to a physically challenged girl

The movie Family Star, which revolves around the concept that anyone who supports their family is a family star, is…

8 months ago

దివ్యాంగురాలైన రియల్ ఫ్యామిలీస్టార్ ను కలిసి సర్ ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ, దిల్ రాజు, పరశురామ్.

తన కుటుంబానికి సపోర్ట్ గా నిలబడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఫ్యామిలీ స్టార్ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్స్…

8 months ago

మీ ఫ్యామిలీ స్టార్స్ ను సర్ ప్రైజ్ చేయబోతున్న “ఫ్యామిలీ స్టార్” టీమ్

ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కంటిన్యూ చేస్తోంది విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా. తమ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడే వాళ్లంతా…

9 months ago

The “Family Star” team is going to pay a surprise visit to your family stars

The Vijay Deverakonda's family-centric film continues its successful run in theaters, bolstered by the support of family audiences. The storyline…

9 months ago

‘వారసుడు’ తెలుగులో జనవరి 14 న విడుదల చేస్తున్నాం. నిర్మాత దిల్ రాజు

మన తెలుగు బిగ్గర్ స్టార్స్ చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కి గ్రాండ్ గా విడుదల కావాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ‘వారసుడు’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. తెలుగులో పెద్ద విజయం సాధిస్తుంది: నిర్మాత దిల్ రాజు దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు/వారిసు తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు (సోమవారం) వారసుడు తెలుగు విడుదల తేదిని తెలియజేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘వారసుడు’ చిత్రాన్ని సంక్రాంతి వారసుడిగా జనవరి 14న విడుదల చేస్తున్నాం. తమిళ్ లో ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న విదుదలౌతుంది.  ఈ నిర్ణయం వెనుక వున్న కారణం.. జనవరి 12 బాలకృష్ణ గారి వీరసింహా రెడ్డి, జనవరి 13న చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలౌతున్నాయి. ప్రతి థియేటర్ లో ముందు మన తెలుగు బిగ్గర్ స్టార్స్ సినిమాలు పడాలి. అన్ని చోట్ల వారికి థియేటర్లు దొరకాలి. తర్వాతే నా సినిమా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. సంక్రాంతి సినిమాలకి మా వారసుడు పోటి కాదని మొదటి నుండి చెబుతున్నాను. మాది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ప్రేక్షకులకు సంక్రాంతి వారసుడు చేయాలనేదే నా ప్రయత్నం. బాలకృష్ణ గారి చిరంజీవి గారి సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద రిలీజ్ కావాలి. తర్వాత నా సినిమా రావాలని పాజిటివ్ గానే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం పట్ల ఇండస్ట్రీ పెద్దలు చాలా ఆనందం వ్యక్తం చేశారు. అందరం బావుండాలనే నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటాను.  11న తమిళ్ లో విడుదలౌతున్న ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ కాబోతుంది. ఒక చోట విజయం సాధిస్తే ఆ చిత్రాన్ని ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దంగా వుంటారు. కాంతార, లవ్ టుడే చిత్రాలు ఇది నిరూపించాయి.  మా గత చిత్రాలు సీతమ్మ వాకిట్లో, ఎఫ్ 2, శతమానం భవతి సినిమాల్లనే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసే చిత్రం వారసుడు. ఒక మంచి సినిమా చుశామనే అనుభూతిని ఇస్తుంది వారసుడు. ఇది దిల్ రాజు బ్రాండ్. తమన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది. విజయ్ ఆల్రెడీ సూపర్ స్టార్. ఇందులో అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. ఇందులో శరత్ కుమార్,  జయసుధగారు తల్లితండ్రులుగా.. విజయ్, శ్రీకాంత్ శ్యాం బ్రదర్స్ గా కనిపిస్తారు. ఇది పక్కా ఫ్యామిలీ స్టొరీ. ఇందులో ఫ్యామిలీ కోణంలో ఒక కొత్త పాయింట్ చెబుతున్నాం. సినిమా చూసి వచ్చేటప్పుడు ఆ పాయింట్ ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది. ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా ఫీలౌతారు. ఒక మంచి సినిమా చూసామని ఫీలింగ్ తో ప్రేక్షకులు బయటికి వస్తారు. మా సంక్రాంతి వారసుడు మళ్ళీ సంక్రాంతికి తెలుగులో కూడా ఒక మంచి హిట్ సినిమా కాబోతుంది’’ అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. వారసుడు యునివర్సల్ సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. మన తెలుగు స్టార్స్ కి గౌరవం ఇస్తూ.. ఇన్ని కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాని 14కి వాయిదా వేయడం నిజంగా గ్రేట్. దిల్ రాజు గారికి హ్యాట్సప్. ఇంత సాహసం ఏ నిర్మాత చేయరు. వారసుడు నా తొలి తమిళ సినిమా. అలాగే దిల్ రాజు గారి బ్యానర్ లో చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమా గురించి చెప్పాలంటే విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు గారి గురించి చెప్పాలి. విజయ్ తో సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసి చాలా కాలమైయింది. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఇది తెలుగు సినిమాలానే ఫీలౌతాము. వారసుడు సంక్రాంతికి లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వస్తుందని నమ్ముతున్నాను. వారసుడు సూపర్ డూపర్ హిట్ అవుతుంది.’’ అన్నారు

2 years ago