దర్శకుడు మేర్లపాక గాంధీ, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్ టైన్‌మెంట్ తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ? లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ చాలా మంచి కథ. బిగినింగ్ నుండి ఎడింగ్ వరకూ చాలా లేయర్స్ వున్న స్క్రిప్ట్. నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ ట్రావెలింగ్ నేపధ్యంలో వుంటుంది. అలాగే ఇందులో నా పాత్రలో చాలా మలుపులు, ఎత్తుపల్లాలు వుంటాయి. ఇందులో ప్రతి పాత్రకు ఒక నేపధ్యం ఉంటూ కథలో భాగం అవుతుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ లో మీ పాత్ర ఎలా వుండబోతుంది ? ఇందులో ట్రావెల్ వ్లాగర్ గా కనిపిస్తా. వీడియోస్ కోసం దేశమంతా తిరిగే పాత్ర ఇది. ఈ ప్రయాణంలో హీరోని కలుస్తా. తను కూడా ఒక ట్రావెల్ వ్లాగర్. కథ చాలా ఎంటర్ టైనింగా వుంటుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ప్రయాణంలో మర్చిపోలేని జ్ఞాపకాలు వున్నాయి. జీవితంలో మొదటి విదేశీ ప్రయాణం ఈ సినిమా వలనే జరిగింది. థాయిలాండ్ లో ఒక పాట షూట్ చేయడం కోసం వెళ్లాను. మర్చిపోలేని జ్ఞాపకం ఇది. జాతిరత్నాలు, లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్.. ఈ రెండు చిత్రాల ట్రైలర్స్ ని ప్రభాస్ గారు విడుదల చేయడం ఎలా అనిపించింది ? లక్కీ ఛార్మ్ గా ఫీలౌతున్నా. జాతిరత్నాలు తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ లో కనిపించా. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ హీరోయిన్ గా నా రెండో సినిమా. చాలా ఎక్సయిటెడ్ గా వుంది. జాతిరత్నాలు లానే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. హీరో సంతోష్ శోభన్ గురించి ? సంతోష్ శోభన్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా ప్యాషనేట్ గా పని చేస్తారు. సంతోష్ శోభన్ తో నటించడం ఆనందంగా వుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ గారితో పని చేయడం ఎలా అనిపించింది ? మేర్లపాక గాంధీ గారితో పని చేయడం డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. చాలా క్లారిటీతో డైరెక్ట్ చేస్తారు. ఆయన ఫన్ కూడా చాలా నేచురల్ గా వుంటుంది. ఆయన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోయా. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ విషయంలో మీకు సవాల్ గా అనిపించిన అంశాలు ఏమిటి ? చాలా అడ్వంచర్ మూవీ ఇది. అడ్వంచర్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్. 40 శాతం సినిమా అడవిలో జరుగుతుంది. ఇరవై రోజులు అడవిలోనే వున్నాం. సిగ్నల్ కూడా వుండదు. ట్రైలర్ లో ఒక ఊబి కనిపిస్తుంది. దాన్ని క్రియేట్ చేశాం. అలాగే యాక్షన్, చేజింగ్ సీన్లు వున్నాయి. మొత్తం ఖత్రోన్ కే ఖిలాడీ లాంటి అనుభవం ఇచ్చింది (నవ్వుతూ). మీ మొదటి సినిమా జాతిరత్నాలు లో 'చిట్టి' పాత్రకు మంచి పేరొచ్చింది కదా.. ఆ పేరుతోనే పిలుస్తున్నారు.. ఈ విషయంలో భాద్యత పెరిగిందని అనిపిస్తుందా ? 'చిట్టి' పాత్రని అందరూ అభిమానించారు. చిట్టి అనేది ఒక ఎమోషన్ గా మారింది. ఈ విషయం లో ఆనందంతో పాటు భాద్యత కూడా పెరిగింది. నా స్కిల్ పై నాకు పూర్తి నమ్మకం వుంది. అయితే ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ ని ఆదరిస్తారనేది కూడా ఇక్కడ కీలకం. నా పాత్ర వరకూ వందశాతం బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఈ సినిమాలో చిట్టి కాదు వసుధనే కనిపిస్తుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సుదర్శన్ కి మీకు మంచి కాంబినేషన్ ఉంటుందని విన్నాం ?…