Banaras

బనారస్ దర్శకుడు జయతీర్థ ఇంటర్వ్యూ

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'బనారస్‌' తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు జయతీర్థ విలేఖరుల సమా'వేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. 'బనారస్‌' సినిమా ఎలా మొదలైయింది ? నా గత చిత్రం బెల్ బాటమ్ 2019 ఫిబ్రవరి లో విడుదలైయింది. మార్చ్ నెలలో ఎన్‌ కె ప్రొడక్షన్స్ హౌస్  జైద్ ఖాన్ ని లాంచ్ చేయమని నన్ను సంప్రదించింది. జైద్ ఖాన్ కు పొలిటికల్ గా ఒక స్టార్ ఇమేజ్ వుంది. జైద్ నాన్నగారు జమీర్ అహ్మద్ ప్రముఖ రాజకీయ నేత. జైద్ ని లాంచ్ చేయడం అంటే ఒక ఒత్తిడి వుంటుంది. అయితే ఒక దర్శకుడిగా నాకు పూర్తి స్వేచ్ఛకావాలి, ఎలాంటి ఒత్తిళ్ళు వుండకూడదని వారిని కోరాను. నా కోరికని అంగీకరించారు. నాకు పూర్తి స్వేఛ్చని ఇచ్చారు.  ఒక ప్రేమకథని వైవిధ్యంగా ప్రజంట్ చేయాలని భావించాను. నేను చెప్పిన కథ జైద్  కిచాలా నచ్చింది. మూడు నెలలు స్క్రీన్ ప్లే రాశాను. నేను నాటకరంగం నుండి సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లోకి రాకముందు నటనలో శిక్షణ ఇచ్చేవాడిని. ఇది కొత్త వారితో సినిమాలు చేసినప్పుడు ఉపయోగపడింది. ఈ సినిమాలో పాత్రకి తగ్గట్టు జైద్ కి శిక్షణ ఇచ్చాను. అలాగే ఈ సినిమా కోసం కాశీ, బనారస్ పర్యటించిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టాను. 'బనారస్‌' ట్రైలర్ చూసిన తర్వాత టైం ట్రావెల్ సినిమా అనిపించింది. మరి ఇందులో ఫ్రెష్ ఎలిమెంట్ ఏమిటి ? 'బనారస్‌' కేవలం  టైం ట్రావెల్ సినిమా కాదు. ఒక ఒక ప్రేమకథ. రొమాంటిక్ స్టొరీ. అలాగే థ్రిల్లర్. వీటిలో టైం ట్రావెల్, టైం లూప్, పునర్జన్మ ఎలిమెంట్స్ కూడా వుంటాయి. స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా వుంటుంది. చాలా మిస్టికల్ డివైన్ అంశాలు వుంటాయి. ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. జైద్ ఖాన్ లాంటి కొత్త నటుడితో సినిమా చేయడం ఎలా అనిపించింది ? బెల్ బాటమ్ చేసినపుడు రిషబ్ శెట్టి కూడా కొత్తే. రిషబ్ శెట్టి మంచి దర్శకుడు. అయితే హీరోగా అదే అతనికి తొలి సినిమా. ఆ పాత్రకి తగ్గట్టు అతన్ని మలచుకున్నా. ఇప్పటి వరకూ ఏడు సినిమాలు చేస్తే నాలుగు సినిమాల్లో కొత్తవారితోనే చేశాను. నేను యాక్టింగ్ టీచర్ కావడం వలన కొత్త వారితో చేయడం సులువు. నా పాత్రలకు తగ్గట్టు మలుచుకోగలను. ఇప్పటివరకూ నేను శిక్షణ ఇచ్చి, లాంచ్ చేసిన నటీనటులు లంతా మంచి స్థాయిలో వున్నారు. జైద్ కూడా తప్పకుండా గొప్ప స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాను.  'బనారస్‌' షూటింగ్ ఎదుర్కున్న సవాళ్లు ఏంటి ? 90 శాతం షూటింగ్ బనారస్‌ లోనే చేశాం. 2019 సెప్టెంబర్ లో షూటింగ్ వెళ్లినపుడు వరదలు వచ్చాయి. తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో షూటింగ్ చేశాం. అయితే 2,3 డిగ్రీల ఉష్ట్నోగత వద్ద షూట్ చేయడం ఒక సవాల్.  అయితే స్థానికులు చాలా సహకరించారు.  లాక్ డౌన్ కి ముందే రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. లాక్ డౌన్ ఎత్తిన తర్వాత పాటలు షూట్ చేశాం. సెన్సార్ పూర్తయిన తర్వాత మా నిర్మాతలు సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. నిజానికి బనారస్ యూనివర్సల్ అప్పీల్ వున్న కంటెంట్. భారీ నిర్మాణ , సాంకేతిక విలువలతో తెరకెక్కించారు. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడంతో మరికొన్ని మార్పులు చేశాం. ఫైనల్ ప్రాజెక్ట్ అద్భుతంగా వచ్చింది. ట్రైలర్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. వైజాగ్, హైదరాబాద్ వెళ్ళినపుడు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కదా ? అవును.. తెలుగు ప్రేక్షకుల గొప్పదనం ఇది. కంటెంట్ నచ్చితే భాషలకు అతీతంగా ఆదరిస్తారు. బనారస్ ట్రైలర్ పాటలు వారికి నచ్చాయి. నా బెల్ బాటమ్ సినిమాని కూడా ఓటీటీలో పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు జైద్ లాంచింగ్ కి ముందే గొప్ప ప్రేమని పంచారు. సినిమా చూసిన తర్వాత మరింతగా ప్రేమిస్తారు. సినిమాని చూసిన తర్వాత మంచి పాజిటివ్ కంటెంట్ ని చుశామనే ఆనందం ప్రేక్షకుల్లో కలుగుతుందనే నమ్మకం వుంది. కెజియఫ్, కాంతార.. చిత్రాలతో కన్నడ పరిశ్రమ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తుంది ? చాలా ఆనందంగా వుంది. కెజియఫ్, కాంతార, 777 చార్లీ, విక్రాంత్ రోణ చిత్రాలు దేశవ్యాప్తంగా మంచి పేరుతెచ్చుకున్నాయి. కన్నడ నుండి వచ్చే సినిమాలని ప్రేక్షకులు ఇప్పుడు నోటీస్ చేస్తున్నారు.  'బనారస్' కూడా మంచి కంటెంట్ వున్న చిత్రం. ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనే ఎక్సయిమెంట్ వుంది.…

2 years ago