మాస్ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పాన్ ఇండియన్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్ సింగిల్ ఏక్ దమ్ సెప్టెంబర్ 5న విడుదల టైగర్…
మాస్ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంఛి సారా పాత్రలో నూపూర్ సనన్ ఫస్ట్ లుక్ విడుదల…
Shiva Rajkumar 's Pan India Action Spectacle 'Ghost' Is Arriving On October 19 Karunada Chakravarthy Shiva Rajkumar's Pan India Film…
శివరాజ్ కుమార్ పాన్ ఇండియా యాక్షన్ స్పెక్టకిల్ 'ఘోస్ట్' ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్…
పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్బస్టర్లను అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దేశవ్యాప్తంగా పేరున్న మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్…
కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ పాన్ ఇండియా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘోస్ట్' నుండి బ్లాస్టింగ్ 'బిగ్ డాడీ' టీజర్ విడుదల కరుణడ చక్రవర్తి…
కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్యాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న చిత్రం ఘోస్ట్. కన్నడ బీర్బల్…
Ram Charan and Vikram Reddy's V Mega Pictures and Abhishek Agarwal Arts announce their first film ‘The India House’ with…
రామ్ చరణ్, విక్రమ్ రెడ్డిల V మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మొదటి చిత్రం ‘ది ఇండియా హౌస్’ పవర్ ప్యాక్డ్ మోషన్ వీడియో ద్వారా…
సక్సెస్ ఫుల్, డైనమిక్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి పాత్ బ్రేకింగ్ చిత్రాలతో పాటు తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మరొక అడుగు ముందుకేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తిమ్మాపూర్ కేబినెట్ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి జన్మస్థలం కావడం మరో విశేషం. అభిషేక్ అగర్వాల్, అతని కుటుంబం చంద్రకళ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు. తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు, దివంగత అమ్మమ్మ శ్రీమతి చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు, చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివస్ హైదరాబాద్ లోని జే ఆర్సీ కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరిగింది. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో అభిషేక్ అగర్వాల్, తేజ్ నారాయణ్ అగర్వాల్, అనుపమ్ ఖేర్ , వివేక్ అగ్ని హోత్రి, పల్లవి జోషి, పీవీ సింధు, ఉత్తర్ ప్రదేశ్ మంత్రి నందగోపాల్, శ్రీమతి కావ్య రెడ్డి, స్నేహలతా అగర్వాల్, నిశాంత్ అగర్వాల్, అర్చన అగర్వాల్, సోనమ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ విలేజ్ మైల్ స్టోన్ ని ఆవిష్కరించారు. తిమ్మాపూర్ గ్రామ విద్యార్ధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. అభిషేక్ అగర్వాల్ కుటుంబం ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టింది. అభిషేక్ అగర్వాల్ తండ్రి గారి పుట్టిన రోజున గ్రామాన్ని దత్తత తీసుకోవడం మరింత ఆనందకరమైన విషయం. గొప్ప పనులు చేసేవారికి అందరి ఆశీస్సులు వుంటాయి. అభిషేక్ అగర్వాల్ వెంట మేముంటాం. తిమ్మాపూర్ లో మళ్ళీ కలుస్తాం. విద్యార్ధులందరికీ నా ఆశీస్సులు. అలలకు భయపడితే పడవ ముందుకు వెళ్ళలేదు. ప్రయత్నించేవారికి ఓటమి వుండదు. మీరంతా గొప్పగా ఎదగాలి.'' అని కోరారుపీవీ సింధు మాట్లాడుతూ.. గ్రామాన్ని దత్తత తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. అభిషేక్ అగర్వాల్ గారి గొప్ప మనసుకు హ్యాట్సప్. తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని అన్నీ మౌలిక వసతులు కల్పించడానికి సంకల్పించారు. గ్రామంలోని విద్యార్ధులు కూడా చక్కగా చదువుకొని మరెందరికో స్ఫూర్తిని ఇవ్వాలి. అభిషేక్ అగర్వాల్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్'' తెలిపారు. పల్లవి జోషి మాట్లాడుతూ.. ఇక్కడ కూర్చున్న స్కూల్ విద్యార్ధులని చూస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తుకువచ్చాయి. అభిషేక్ అగర్వాల్ గారు గ్రామాన్ని దత్తత తీసుకోవడం మరింత మెరుగైన విద్య అందుతుందని విశ్వాసం వుంది. భవిష్యత్ లో మీలో నుండి ఒక పీవీ సిందు వస్తుందనే నమ్మకం వుంది. ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నా అభిషేక్ అగర్వాల్, తేజ్ నారాయణ్ అగర్వాల్ హృదయపూర్వక కృతజ్ఞతలు.వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. భారతదేశానికి పల్లెలు పట్టుకొమ్మలు. నాగరిక, సంస్కృతికి మూలకేంద్రాలు పల్లెలు. ఆలాంటి పల్లెలని అభివృద్ధి పధంలోకి తీసుకురావడం నిజమైన ధర్మం, దేశభక్తి. అభిషేక్ అగర్వల్ తిమ్మాపూర్ న్ని దత్తత తీసుకోని, ఆదర్శ గ్రామంగా మలచడానికి సంకల్పించడం గొప్ప విషయం. ఇంత గొప్ప ఉపకారాన్ని చేస్తున్న అభిషేక్ అగర్వల్ కి అభినందనలు. వారి పిల్లలు కూడా ఈ సేవకార్యక్రమాలని కొనసాగించాల్సిందిగా ఆశిస్తున్నాను.శ్రీమతి కావ్యరెడ్డి మాట్లాడుతూ.. అభిషేక్ అగర్వాల్ మా అత్తగారి ఊరు తిమ్మాపూర్ ని దత్తత తీసుకోవడం చాలా ఆనందంగా వుంది. వారికీ మనస్పూర్తిగా అభినందనలు. గ్రామానికి విద్య వైద్యం ఇలా అన్ని మౌలిక వసతులు కల్పించి గొప్ప అభివృద్ధి పధం వైపు నడిపిస్తున్నందుకు అభిషేక్ అగర్వాల్ గారికి అభినందనలు'' తెలిపారు. మంత్రి నందగోపాల్ మాట్లాడుతూ.. చంద్రకళ ఫౌండేషన్ గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తోంది. కోవిడ్ సమయంలో వారు అందించిన సేవలు మహోన్నతమైనవి. కష్ట కాలంలో వారు చూపిన ఔదార్యం అభినందనీయం.అభిషేక్ అగర్వాల్ మరో అడుగు ముందుకేసి తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చడానికి ముందుకు రావడం చాలా సంతోషం. చంద్రకళ ఫౌండేషన్ మరిన్ని సేవాకార్యక్రమాలతో ముందుకు వెల్లాలని, ఈ విషయంలో వారికి మా సాకారం ఉంటుంది'' అని పేర్కొన్నారు.కాళి సుధీర్ మాట్లాడుతూ... అమరేంద్ర గారి ఆలోచన వలనే ఇది మొదలైయింది. ఆయనకి కృతజ్ఞతలు. జ్యోతి గారికి కృతజ్ఞతలు. పీవీ సింధు, పల్లవి జోషి, వివేక్ అగ్ని హోత్రి, నందగోపాల్, అనుపమ్ ఖేర్, కావ్యరెడ్డిగారికి .. వేడుకకు హాజరైన అందరికీ కృతజ్ఞతలు.'' తెలిపారు