చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో ఔట్ & ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో, హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ సినిమాలోని “ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే..’ సాంగ్ ను కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు.
ఐయామ్ సో సారీ సారీ.. ఐయామ్ వెరీ సారీ సారీ..
నువ్వట్ల కన్నెర్ర జేసీ కోపంగా చూడకే నా బుజ్జి బంగారం
ఐయామ్ సో సారీ సారీ ఐయామ్ వెరీ సారీ సారీ
నన్నిట్ట తిప్పించుకుంటూ తప్పించుకోకే క్షమించు ఓ సా..రి
చాలా.. రిక్వెస్ట్ గా అడుగు…తున్నా మాటాడవా..
బేబీ… హనెస్ట్ గా వేడుకున్నా.. శాంతించవా..
ఈ అలకలు, చిలకలు చిటికెలు ఎగిరే దారే.. లేదా
ఓ… మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే..
ఓ.. మేరీ జాన్ వెనకే నీతో వస్తూ.. ఉన్నదే..
ఓ.. మేరీ జాన్ నిన్నే.. వదిలి వదిలి ఉండ నన్నదే..
అంటూ హీరోయిన్ కు సారీ చెప్పడానికి తన వెంటపడే లవ్ సాంగ్ చాలా క్లాసీ గా ఇంట్రెస్ట్ గా ఉంది. బిగ్ బాస్ తరువాత హీరోగా నటిస్తున్న సోహైల్ సింపుల్ స్టెప్స్ తో వేసిన డ్యాన్స్ చాలా ఈజ్ గా ఉంది. ఈ పాటను ప్రముఖ రచయిత భాస్కరపట్ల రాశారు. సింగర్ అనురాగ్ కులకర్ణి చక్కగా ఆలపించారు. ఈ పాటకు విశాల్ అందించిన కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. డి ఓ పి ఆండ్రు చక్కటి విజువల్స్ ఇచ్చారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ పాటలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఆయన నుంచి వస్తున్న “ఓ మేరీ జాన్” మరో క్రేజీ సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే ప్రేక్షకులనుండి హ్యుజ్ రెస్పాన్స్ వస్తోంది. టిప్స్ ఆడియో ద్వారా విడుదలైన పాటలన్నీ కూడా ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తాయి.
నటీనటులు
సోహెల్, మోక్ష, దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, రచ్చ రవి , జబర్దస్త్ కార్తిక్, జబర్దస్త్ గీతు రాయల్, కామెడీ స్టార్స్ ఫేమ్ యాదం రాజు తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ – దత్తాత్రేయ మీడియా, నిర్మాత – హరిత గోగినేని,
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – ఏఆర్ అభి,
సంగీతం – అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్ – ఐ. ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, పాటలు – భాస్కరభట్ల, కొరియోగ్రాఫర్ – విశాల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విజయానంద్. కీత, పీఆర్వో – నాయుడు-ఫణి, మార్కెటింగ్ పార్ట్ నర్ – టికెట్ ఫ్యాక్టరీ, పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే, కాస్టింగ్ డైరెక్టర్ – ఓవర్ 7 ప్రొడక్షన్స్
తమిళ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ…
Movies made in the Tamil industry are being dubbed in Telugu and achieving great success.Without…
Chetan Krishna and Hebah Patel are playing the lead roles in the film Dhoom Dham.…
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్,…
యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుధీర్…
Young and dynamic actor Nikhil Siddhartha is all set to impress with his upcoming film…