హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సంపత్‌ నంది, అశోక్‌ తేజ్‌, కె.కె.రాధా మోహన్‌ ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ ఆగస్ట్ 26న విడుదల

స్టార్ దర్శకుడు సంపత్‌ నంది అందించిన కథ, స్క్రీన్ ప్లేతో హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ  ప్రధాన పాత్రల్లో అశోక్‌ తేజ్‌ దర్శకత్వంలో కె.కె.రాధా మోహన్‌ నిర్మించిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్‌’. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 26న ‘ఆహా’ వేదికగా విడుదలౌతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలని పంచుకుంది.

వశిష్ట సింహ మాట్లాడుతూ.. ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ చాలా మంచి కథ. నాకు చాలా ఇష్టమైన సినిమా. కరోనా సెకండ్ వేవ్ సమయంలో అందరికీ సేఫ్టి ఇచ్చి ఇంత చక్కటి సినిమా తీసిన రాధా మోహన్‌ గారికి అభినందనలు. ఈ సినిమా కథని విన్నపుడు చాలా థ్రిల్ అయ్యాను. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా వుంటుంది. ఈ సినిమాతో సంపత్ నంది, హెబ్బా పటేల్, సాయి రోనక్ .. ఇలా అందరూ మంచి ఫ్రండ్స్ అయ్యారు. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా. ఈ చిత్రంలో ప్రతి పాత్ర ఆకట్టుకుంటుంది. .‘ఓదెల రైల్వేస్టేషన్‌’ ఆహాలో వస్తుంది. తప్పకుండా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. ఒరేయ్ బుజ్జిగాలో క్యామియో రోల్ చేశాను. అప్పుడే నిర్మాత రాధా మోహన్‌ గారు నాతో ఒక సినిమా చేస్తానని మాటిచ్చారు. అయితే ఇండస్ట్రీలో ఇలాంటి మాటలు చాలా వింటాం. లాక్ డౌన్ లో ఫోన్ చేసి ‘ఓదెల రైల్వేస్టేషన్‌ గురించి చెప్పారు. చాలా సర్ప్రైజ్ అయ్యా. మాటని నిలబెట్టుకునే మనుషులు చాలా తక్కువగా వుంటారు. ఈ విషయంలో రాధా మోహన్‌ గారికి చాలా థాంక్స్. సంపత్‌ నంది గారు ఈ కథ చెప్పినపుడు చాలా సర్ ప్రైజ్ ఫీలయ్యా. ఇలాంటి పాత్రని నేను ఎప్పుడూ చేయలేదు. అసలు నేను చేయగలనా ? అనే అనుమానం కూడా వచ్చింది. ఐతే సంపత్ గారు ఒకసారి ప్రయత్నించమని చెప్పారు. నా కెరీర్ లో చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ కష్టాన్ని చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో నా పాత్ర ఒక సవాల్ తో కూడుకున్నది. ఒక నటిగా ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను. వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ లాంటి మంచి టీంతో కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

నిర్మాత కె.కె.రాధా మోహన్‌ మాట్లాడుతూ.. ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ క్రైమ్ థ్రిల్లర్.  దర్శకుడు సంపత్‌ నంది కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఏమైయింది ఈవేళ నుండి సంతప్ నంది గారితో పరిచయం వుంది. డీ వోపీ సౌందర్ రాజన్, మ్యూజిక్ అనూప్ రూబెన్స్ ఇలా చాలా అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేశారు. వశిష్ట ఇందులో అవుట్ అఫ్ ది బాక్స్ పాత్ర చేశారు. హెబ్బా పటేల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేసింది. సాయి రోనక్, పూజిత పొన్నాడ మిగతా వాళ్ళు అందరూ  కూడా చక్కగా నటించారు. 50 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేశాం. కోవిడ్ సెకండ్ వేవ్ వలన రిలీజ్ కొంచెం ఆలస్యం అయ్యింది. ఈ సినిమాని విడుదల చేయడానికి ఆహా ఒక వేదికని ఇచ్చింది. గతంలో ఆహాలో విడుదలైన ఒరేయ్ బుజ్జిగా అందరినీ అలరించింది. ఈ చిత్రం కూడా ఆహాలో మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నాను” అన్నారు

దర్శకుడు అశోక్‌ తేజ్‌ మాట్లాడుతూ.. కథ, మాటలు ఇచ్చిన సంపత్ నంది గారికి, నన్ను దర్శకుడిని చేసిన రాధా మోహన్‌ గారికి జీవితాంతం రుణపడివుంటాను. హెబ్బా పటేల్, వశిష్ట సింహ,సాయి రోనక్, పూజిత పొన్నాడ.. చాలా అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. అందరికి చాలా మంచి పేరు వస్తుంది. ఈ చిత్రం కోసం పని చేసిన అందరికీ థాంక్స్. ఆహాకు ప్రత్యేక కృతజ్ఞతలు” తెలిపారు.

సాయి రోనక్ మాట్లాడుతూ.. ఇంతకుముందు కొన్ని సాఫ్ట్ పాత్రలు చేశాను, కానీ ఇందులో చాలా సీరియస్ కాప్  రోల్ చేశా. నన్ను ఆ పాత్ర కోసం నమ్మిన డైరెక్టర్ గారికి చాలా థాంక్స్. ఈ సినిమా షూట్ చాలా సహజంగా చేశాం. హెబ్బా చాలా కష్టపడి చేసింది. వశిష్ట ఈ సినిమాతో నాకు ఎంతో దగ్గరయ్యారు. ఆహాలో ఈ సినిమా విడుదల కావడం ఆనందంగా వుంది” అన్నారు

ఆహా శ్రీనివాస్ మాట్లాడుతూ..  ఓదెల రైల్వేస్టేషన్‌ సినిమా చుసిన తర్వాత అసలు ఓదెల రైల్వేస్టేషన్‌ ఉందా? అని గూగుల్ చేశాను. సినిమా చూశాకా మీరు కూడా గూగుల్ చేస్తారు. ఒరేయ్ బుజ్జిగా ఆహాలో ఎంత విజయం సాధించిందో ఈ సినిమా కూడా అంత పెద్ద విజయం సాధించాలి” అని కోరుకున్నారు.

తారాగణం:
హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ, గగన్ విహారి, నాగ మహేష్, సురేందర్ రెడ్డి, హారిక, ప్రవణ్య రెడ్డి, దివ్య, నవీన్,
టెక్నికల్ టీమ్
క్రియేటర్ – సంపత్ నంది
నిర్మాత – కెకె రాధా మోహన్
దర్శకత్వం – అశోక్ తేజ
డీవోపీ – సౌందర్ రాజన్. ఎస్
ఎడిటర్ – తమ్మి రాజు
సంగీతం – అనూప్ రూబెన్స్
లిరిక్స్  – కాసర్ల శ్యామ్
ఆర్ట్ డైరెక్టర్ – కొలికపోగు రమేష్
స్టంట్స్ – రియల్ సతీష్
కో రైటర్స్ – గణేష్ ఉప్పునూటి, ప్రదీప్ రెడ్డి, శ్రీకాంత్
డైరెక్షన్ టీమ్ – ఆడెపు గిరిరాజ్, ప్రణయ్‌కేతన్ ఈదునూరి
ప్రొడక్షన్ కంట్రోలర్ – ఎం శ్రీనివాసరావు (గడ్డం శ్రీను), సాధనానందం.
పబ్లిసిటీ డిజైనర్ – రమేష్ కొత్తపల్లి
అసోసియేట్ ఎడిటర్: తారక్
వీఎఫ్ఎక్స్ : ప్రదీప్ పూడి

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago