దర్శకుడు వి.ఎన్. ఆదిత్య చేతుల మీదుగా ‘నెక్స్ట్ లెవల్’ ఫస్ట్ లుక్ విడుదల


తాహిర్, పల్లవి హీరోహీరోయిన్లుగా బత్తిని ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత బి. నరేష్ కుమార్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘నెక్స్ట్ లెవల్’. ఈ చిత్రంతో గోపీ దేవెళ్ళ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. శ్రీనివాస్ వంగపల్లి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని ప్రముఖ నిర్మాత వి.ఎన్. ఆదిత్య తాజాగా విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఫస్ట్ లుక్ విడుదల అనంతరం దర్శకుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ.. ‘‘బత్తిని ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత నరేష్‌గారు నిర్మించిన చిత్రం ‘నెక్ట్స్ లెవల్’. ఇప్పుడున్న టాప్ నిర్మాతలలో చాలా మంది NRIలే. వారి లిస్ట్‌లో నరేష్‌గారు కూడా చేరాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా విజయం సాధించి.. సినిమా టైటిల్‌కి తగ్గట్టుగా ఆయన కూడా ‘నెక్ట్స్ లెవల్’ ప్రొడ్యూసర్‌గా ఎదగాలని.. అందుకు ఈ సినిమా పునాది కావాలని కోరుకుంటున్నాను. మాములుగా అయితే.. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడానికి చాలా మంది సీనియర్ నిర్మాతలే భయపడుతుంటారు. అలాంటిది నిర్మాతను ఒప్పించి.. నాకెంతో ఆప్తుడైన దర్శకుడు గోపి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఆయన కూడా వేరే లెవల్ నుండి.. ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌కి వచ్చాడు. అలాగే సంగీత దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు, హీరోహీరోయిన్లు ఇతర నటీనటులు అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా చాలా ప్రామిసింగ్‌గా ఉంది. నేను అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు చూశాను. ఈ సినిమా ఎవరినీ డిజప్పాయింట్ చేయదు. తప్పకుండా అందరూ ఈ సినిమా చూసి.. ఈ టీమ్‌ని ప్రయత్నాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను..’’ అన్నారు.

చిత్ర నిర్మాత బి. నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా బత్తిని ఫిల్మ్స్‌లో చేస్తున్న మొట్టమొదటి చిత్రమిది. కో ప్రొడ్యూసర్‌ శ్రీనివాస్‌గారు. మా మొదటి చిత్రంతో అంతా కొత్తవారిని ఎంకరేజ్ చేయాలనే ప్రయత్నం చేశాం. మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమిది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. ఫస్ట్ లుక్ విడుదల చేసిన దర్శకులు వి.ఎన్. ఆదిత్యగారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు..’’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు గోపీ దేవెళ్ల మాట్లాడుతూ.. ‘‘ఇది నా మొదటి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. అలాగే ఫస్ట్ లుక్ విడుదల చేసి.. మా టీమ్‌ని బ్లెస్ చేసిన వి.ఎన్. ఆదిత్యగారికి ధన్యవాదాలు. మంచి మెసేజ్‌తో ఈ చిత్రం తెరకెక్కించడం జరిగింది. అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇందులో ఉంది. స్లీపింగ్ ట్యాబ్లెట్‌పై ఈ సినిమా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.

కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ వంగపల్లి మాట్లాడుతూ.. ‘‘బత్తిని ఫిల్మ్స్‌పై నా మిత్రుడు నరేష్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం చాలా గ్రాండ్‌గా తెరకెక్కుతోంది. మంచి మెసేజ్ ఇందులో ఉంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. దర్శకుడు గోపీ తన టాలెంట్ మొత్తం ఈ సినిమాకి చూపిస్తున్నారు. కొత్త నటీనటులు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు.

హీరో తాహిర్, హీరోయిన్ పల్లవి మాట్లాడుతూ.. ఈ అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

తాహిర్, పల్లవి, మహేందర్ నాథ్, కోటి యాదవ్, తులసి మోహన్, శ్వేతాంజలి, మమత, రుషిత, సావిక తదితరులు నటించిన ఈ చిత్రానికి
రైటర్: సి.హెచ్. కిరణ్
సంగీతం: జై
సినిమాటోగ్రఫీ: ఎమ్‌డి. రఫీ
ఎడిటర్: ప్రసాద్ త్రిపర్ణం
పీఆర్వో: బి. వీరబాబు
సహనిర్మాత: శ్రీనివాస్ వంగపల్లి
నిర్మాత: బి. నరేష్ కుమార్ రెడ్డి
దర్శకత్వం: గోపీ దేవెళ్ల

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago