ప్రెస్ మీట్లు

‘పొట్టేల్’ లో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను : హీరోయిన్ అనన్య నాగళ్ల

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి. శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ‘పొట్టేల్’ అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్ల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

‘పొట్టేల్’ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇందులో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి ?
-ఈ ప్రాజెక్ట్ గురించి మొదట నిర్మాత నిశాంక్ గా కాల్ చేసి చెప్పారు. తర్వాత డైరెక్టర్ సాహిత్ కథ చెప్పారు. కథ చాలా బావుంది. అయితే ఇంతకుముందు మదర్ గా ఒక వెబ్ సిరిస్ చేశాను. మళ్ళీ మదర్ అంటే సిమిలర్ అవుతుందేమో అనుకున్నాను. అయితే ఇందులో చదువు అనే పాయింట్ చాలా నచ్చింది. ఇంత మంచి కాన్సెప్ట్, కథలో ఎలా అయిన పార్ట్ కావాలని చేశాను. చేసిన తర్వాత తెలిసింది, ఆ సిరిస్ లో చేసిన రోల్ కి ఇందులో రోల్ కి కంప్లీట్ డిఫరెన్స్ వుంది. ఎక్కడా పోలిక లేదు.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది ?
-ఇందులో నా క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది. ట్రైలర్ లో ఎక్కువ రివిల్ చేయలేదు. సినిమాలో అందరూ సర్ ప్రైజ్ అవుతారు. ఇందులో నా క్యారెక్టర్ పేరు బుజ్జమ్మ. ఇప్పటివరకూ మల్లేశం అనన్య, వకీల్ సాబ్ అనన్య అనే పిలుస్తుంటారు. ఈ సినిమా తర్వాత బుజ్జమ్మ అనన్య అని పిలుస్తారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ ని డైరెక్టర్ గారు చెప్పినట్లుగా చేశాను.  

-ఇందులో నాది చాలా స్ట్రాంగ్ రోల్. ఇందులో పొట్టలో తన్నే సీన్ ఒకటి వుంది. ఆ సీన్ ఎలా వస్తుందో అని మొదట కాస్త కంగారు పడ్డాను. అయితే అజయ్ గారు చాలా సీనియర్. ఆయన ఎక్స్ పీరియన్స్ తో చాలా కంఫర్ట్ బుల్ గా చేశారు. అజయ్ గారు వెరీ డౌన్ టు ఎర్త్ పర్శన్.  ఆయనలాంటి ఎక్స్పీరియన్స్ యాక్టర్ ఉండటంవల్ల ఈ ఆ సీన్ అంత కంఫర్టబుల్ గా వచ్చింది. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఒక మేజర్ హైలట్ గా వుంటుంది.

ట్రైలర్ రిలీజ్ తర్వాత రియాక్షన్స్ ఏమిటి ?
-అన్ఎక్స్పెక్టెడ్ గా చాలామంది ఫ్రెండ్స్ కాల్ చేసి ట్రైలర్ అదిరిపోయింది అని చెప్పారు . వకీల్ సాబ్ మినహిస్తే నా నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ అని చెప్పారు.

‘పొట్టేల్’ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?
-పొట్టేల్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. పొట్టేల్ లేకపోతే ఈ కథ లేదు. పొట్టేల్ పరిగెత్తుతూ వెళ్తున్నప్పుడు కొండ అడ్డం వస్తే దాన్ని ఢీకొడుతుంది కానీ ఆగదు. అది పొట్టేల్ నేచర్. ఈ సినిమాలో మా హీరో క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చిన ముందుకు వెళ్లడమే కానీ వెనక్కి వచ్చే సమస్య లేదు. అలా రెండు విధాలుగా ఈ సినిమా టైటిల్ కి జస్టిఫికేషన్ వచ్చింది.

-ఈ సినిమాలో ప్రతిపాత్రకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కి ఒక ఆర్క్ ఉంటుంది. ఈ సినిమాలో చేసిన ప్రతి యాక్టర్ కి వాళ్ళ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అవుతుందని గర్వంగా చెప్పగలను. అంతా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సినిమా చూసిన తర్వాత ఈ మాట చెబుతున్నాను.

యువతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-యువ వెరీ టాలెంటెడ్. మేమిద్దరం ఇన్ఫోసిస్ లో వర్క్ చేసేవాళ్ళం. అక్కడ ఆయన షార్ట్ ఫిలిమ్స్ వచ్చేసేవాళ్ళు. ఆయనతో ఎప్పుడు నేరుగా మాట్లాడలేదు కానీ ఆయన చేసిన షార్ట్ ఫిలిమ్స్, ఆ ఫ్యాషన్ తో ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీ లోకి వచ్చాను. ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేశారు. ఆడియన్స్ అందరికీ డెఫినెట్ గా నచ్చుతుంది.

ఈ సినిమాలో మేజర్ హైలెట్స్ ఏమిటి?
-స్టోరీ లైన్ ఈ సినిమాకి మెయిన్ హైలెట్.  కమర్షియల్ ఎలిమెంట్స్ ని,  మెసేజ్ ని, తెలంగాణ కల్చర్ ని అద్భుతంగా బ్లెండ్ చేసిన సినిమా ఇది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా నచ్చింది. యువ, పాప మధ్య వచ్చే సీన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల చాలా ఎమోషనల్ గా ఉంటాయి.  కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. యాక్టర్స్ అందరి పెర్ఫార్మెన్స్ లు అద్భుతంగా ఉంటాయి.

ఈ సినిమాలో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి?
-కథ, క్యారెక్టర్, డైరెక్టర్ అప్రోచ్ అయ్యే విధానం బాగుంటే సినిమా చేయొచ్చు అనే ఫీలింగ్ ఉండేది. ఈ సినిమాతో ప్రొడ్యూసర్స్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిలిం అని అర్థమైంది. సినిమాకి ఏం కావాలి, ఎంత పెట్టాలి అనేది ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఒక ప్రాజెక్టు ఇంత అద్భుతంగా వస్తుంది. సినిమాని ఆడియన్స్ వరకు ప్రొడ్యూసర్స్ తప్ప మరెవరూ తీసుకెళ్లలేరు. అది ఈ సినిమాతో అర్థమైంది. డైరెక్టర్ తో పాటు ప్రొడ్యూసర్ కి కూడా ఫ్యాషన్ ఉంటేనే ఒక కథని ఆడియన్స్ వరకు రీచ్ చేయగలరు. సురేష్ అండ్ నిశాంక్ ఇద్దరు పర్ఫెక్ట్ కాంబినేషన్. వారిద్దరి కాంబినేషన్ వల్ల ఈ సినిమా ఇంత  బ్యూటిఫుల్ గా వచ్చింది.

మైత్రీ వారు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు కదా వాళ్ళ రియాక్షన్ ఏంటి?
మైత్రీ వారు చాలా  హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి సినిమా ఈ మధ్యకాలంలో తెలుగులో రాలేదని చెప్పారు.

మీకు వస్తున్న క్యారెక్టర్స్ పట్ల హ్యాపీగా ఉన్నారా ?
-ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొన్ని లవ్ స్టోరీస్, క్యూట్ క్యారెక్టర్స్ చేద్దామనుకున్నాను. అయితే అప్పుడు నాకు అంత అవగాహన లేదు. మల్లేశం వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఒక డిఫరెంట్ లుక్ లో చూశారు. మెచ్యూర్ గా చేస్తున్నాను కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ ఇద్దామని అనుకున్నారు. ఈ విషయంలో హ్యాపీగానే ఉంది.  దీనివల్ల ఒక డిఫరెంట్ సెట్ అప్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాను. ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రూల్స్ కావాలంటే తెలుగు అమ్మాయిల్లో ఉన్న ఇద్దరు ముగ్గురు లో నా పేరు కూడా వినిపిస్తుంది. అందుకే పొట్టేల్ లాంటి స్టోరీస్ వస్తున్నాయని భావిస్తున్నాను. మా అమ్మగారు ఈ సినిమా చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారని నమ్ముతున్నాను.

కొత్తగా చేస్తున్న సినిమాల గురించి ?
-శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్ సినిమా రిలీజ్ కి రెడీగా వుంది. సతీష్ వేగేశ్న గారి కథకళి సినిమా జరుగుతుంది. ‘లేచింది మహిళా లోకం’అనే సినిమా చేస్తున్నాను.

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ

Tfja Team

Recent Posts

ఫిబ్రవరి 7 థియేటర్స్ లో దుల్లకొట్టేద్దాం హీరో అక్కినేని నాగచైతన్య

-తండేల్ టీజర్ ట్రైలర్ సాంగ్స్ లో ఎమోషనల్ కనెక్ట్ కనిపిస్తోంది. సినిమా బిగ్ హిట్ కావాలని కోరుకుంటున్నాను: డైరెక్టర్ సందీప్…

7 minutes ago

విష్ణు మంచు ‘కన్నప్ప’ నుంచి ప్రళయ కాల రుద్రుడిగా ‘ప్రభాస్’ లుక్ విడుదల

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సినిమాను మోహన్ బాబు అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవా…

44 minutes ago

Introducing Rebel Star Prabhas AsRudra From Kannappa

After creating a wave of excitement with the pre-look reveal of Rebel Star Prabhas last…

44 minutes ago

దుల్కర్ సల్మాన్ హీరోగా ‘ఆకాశంలో ఒక తార’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

మల్టీటాలెంటెడ్, దక్షిణాది స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమా సినిమాకీ అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోతోన్నారు.…

19 hours ago

Aakasamlo Oka Tara starring Dulquer Salmaan begins with a Pooja ceremony

Dulquer Salmaan, a multilingual actor and prominent star of Indian cinema, has been known for…

19 hours ago

Brahmanandam look released from Sumanth Mahendragiri Vaarahi !!!

Mahendragiri Vaarahi is the production number 2 film under Rajashyamala banner. Glimpses of this film…

21 hours ago