క్యూరియాసిటీ ని పెంచుతున్న “గీత సాక్షిగా” ఫస్ట్ & సెకండ్ లుక్ పోస్టర్స్

సినిమా అనేది శక్తివంతమైన కళారూపం. సమాజంలోని సత్యాన్ని మరియు కఠినమైన వాస్తవాలను ప్రేక్షకులకు తెలియచేయడానికి ఇప్పటివరకు ఎంతో మంది చిత్ర నిర్మాతలు చేసిన ప్రయత్నాలకు ప్రేక్షకులనుండి గుర్తించబడడమే కాకుండా, ప్రేక్షకుల , ప్రేమ, ఆధరణతో వారు తీసిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. ఇప్పుడు అదే తరహా కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ తో వస్తున్న చిత్రమే “గీత సాక్షిగా”.

PUSHPAK మరియు JBHRNKL సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆంథోని మట్టిపల్లి స్క్రీన్ ప్లే రాసుకొని మొదటి సారి మెగాఫోన్ పట్టారు. చేతన్ రాజ్ ఈ సినిమాకు కథను అందిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంచలన సంగీత విద్వాంసుడు గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి సంబంధించిన ప్రీ-అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది..పోస్టర్ లో కోర్టు మరియు పోలీసు విచారణకు సంబంధించిన విషయాలను చూపిస్తూ.. నేరం మరియు న్యాయంపై ఆధారపడిన బలమైన సబ్జెక్ట్ ఉన్న చిత్రంగా ఆగుపిస్తుంది అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే చిన్నారి తప్పించుకోవడానికి ప్రయత్నించడం,అదే చిన్నారి పోస్టర్‌పై పెద్దల నీడ కనిపించడంతో ఈ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

అలాగే సెకండ్ లుక్‌ను పోస్టర్ లో శ్రీకాంత్ అయ్యంగార్ లాయర్ వేషంలో ఎంతో సీరియస్ గా వున్నట్లు తన ముఖం కనిపిస్తుంది. పోస్టర్ పై ‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా’ అనే క్యాప్షన్‌ ఉండడంతో అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఉన్నారు.

నటీ నటులు
ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు

సాంకేతిక నిపుణులు
కథ – నిర్మాత : చేతన్ రాజ్
స్క్రీన్ ప్లే – దర్శకత్వం : ఆంథోని మట్టిపల్లి
సంగీతం: గోపీసుందర్
ఆడియో : ఆదిత్య మ్యూజిక్
సినిమాటోగ్రఫీ: వెంకట్ హనుమ
ఎడిటర్: కిషోర్ మద్దాలి
సాహిత్యం: రెహమాన్
కళ: నాని
నృత్యం : యశ్వంత్ – అనీష్
ఫైట్స్ – పృధ్వీ
పి. ఆర్. ఓ : సురేంద్ర నాయుడు, ఫణి

Tfja Team

Recent Posts

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

11 hours ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

2 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

2 days ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

2 days ago

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…

2 days ago