అల్లూరి సక్సెస్ మీట్

ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’.  ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించగా బెక్కెం బబిత సమర్పించారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘అల్లూరి’ అన్ని ప్రాంతాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మార్నింగ్ షో కుదరలేదు. దానికి ప్రేక్షకులకు క్షమాపణలు. సీనియర్స్ పోలీస్ ఆఫీసర్ కథని ఒక బయోపిక్ లా కీలకమైన సంఘటనలతో ప్రజంట్ చేశాం. ప్రేక్షకుల నుండి కూడా అంతే సిన్సియర్స్ గా  మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ సీన్స్ కి విజల్స్ వేస్తున్నారు. నేను ఫైట్లు చేస్తే విజల్స్ వేయడం నాకే కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ కి చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. సెకండ్ హాఫ్ లో చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు పేరుపేరునా కృతజ్ఞతలు. రాజ్ తోట అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. దర్శకుడు ప్రదీప్ కథ చెప్పినట్లే చాలా సీనియర్స్ గా సినిమాని ప్రజంట్ చేశారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు నన్ను ప్రేమ ఇష్క్ కాదల్ తో పరిచయం చేశారు. ఆయనతో జర్నీ చాలా బావుంటుంది. చాలా మంచి మనిషి. ఈ  సినిమా చూసిన వాళ్ళు మీ అనుభవాన్ని స్నేహితులకి చెప్పండి. మీడియా, వంశీ-శేఖర్ కి థాంక్స్. ఈ సినిమాని చూడని వాళ్ళు వెంటనే చూడండి. ఈ సినిమాని అందరూ ఆదరించి ఇంకా పెద్ద సినిమా చేయాలి” అని కోరారు.



ప్రదీప్ వర్మ మాట్లాడుతూ.. నేను అనుకున్న కథ రాశాను, డైరెక్ట్ చేశాను,  రిలీజ్ చేశాం. నా కల నెరవేరింది. నేను విజయసాధించాననే ఆనందం వుంది. శ్రీవిష్ణు అద్భుతంగా చేశారు. అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తోంది. నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని చేశారు. విజువల్స్ ఇంత రిచ్ గా ఉండటానికి కారణం నిర్మాత ఇచ్చిన సపోర్ట్. రాజ్ తోట అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. హర్షవర్ధన్ రామేశ్వర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. రామకృష్ణ బ్రిలియంట్ గా యాక్షన్ డిజైన్ చేశారు. మిగతా సాంకేతిక నిపుణులు అద్భుతమైన వర్క్ ఇచ్చారు. నా డైరెక్షన్ టీంకి కృతజ్ఞతలు. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా బావుందని చాలా మంది చెబుతున్నారు. ఇప్పుడు సినిమాని ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఈ పని మీడియా మాత్రమే చేయగలదు. దయచేసి మీడియా సినిమాని మరింత జనాల్లోకి తీసుకెళ్ళాలి” అని కోరారు

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. .. ‘అల్లూరి’ నిన్న మాట్నీ షో నుండి అన్ని చోట్ల రిలీజ్ అయ్యింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మార్నింగ్ షో పడలేదు. మాట్నీ షో నుండి క్రమంగా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. సినిమా చూసిన ప్రతిఒక్కరూ  స్ఫూర్తిని ఇచ్చే చిత్రమని అభినందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని తెలుసు. ఈ సినిమాతో మరోసారి నిరూపిస్తారని కోరుతున్నాను. ఫ్యామిలీ తో కలసి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను.  శ్రీవిష్ణు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది. అలాగే దర్శకుడు ప్రదీప్ వర్మ చాలా చక్కగా తీశారు. రాజ్ తోట అద్భుతమైన విజువల్స్ అందించారు. మిగతా సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. మంచి సినిమా తీశాం. మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాని మరింతగా ప్రేక్షకులు ఆదరించాలి” అని కోరారు.

ఈ సక్సెస్ మీట్ లో డీవోపీ రాజ్ తోట, సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ట్ డైరెక్టర్ విఠల్, ఫైట్ మాష్టర్  రామ్ క్రిషన్, లిరిక్ రైటర్ రాంబాబు గోసాల తదితరులు పాల్గొని సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago