పాపారావు బియ్యాల ‘మ్యూజిక్‌ స్కూల్‌’ కోసం సింఫనీ ఆర్కెస్ట్రాతో రికార్డ్ చేసిన మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా

ఇళయరాజా సంగీతం వహించిన సినిమా మ్యూజిక్‌ స్కూల్‌. బుడాపెస్ట్ లో నేపథ్య సంగీతానికి తుది ముస్తాబులు చేశారు. అక్కడి ఆర్కెస్ట్రాతో నిన్న రికార్డింగ్‌ పూర్తి చేశారు.

ఈ చిత్రంలో  మొత్తం 11 పాటలున్నాయి. మ్యూజిక్‌ స్కూల్‌ ని పాపారావు బియ్యాల రాసి, దర్శకత్వం వహించారు. ఆస్కార్‌ అందుకున్న ది సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో మూడు పాటలు చేశారు.

ఈ సినిమాను హైదరాబాద్‌కు చెందిన యామినీ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ని మ్యాచ్‌ చేయడానికి ఈ సినిమా నేపథ్య సంగీతాన్ని బుడపెస్ట్ లో  చేయాలని నిర్ణయించారు.

”సింఫనీ ఆర్కెస్ట్రాలో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కి చాలా భాగాలను డా.ఇళయరాజా రాశారు. అందుకే మేం బుడపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రాని అప్రోచ్‌ అయ్యాం. ఇప్పుడున్న లీడింగ్‌ ఆర్కెస్ట్రాలో అది ప్రపంచంలో అత్యుత్తమ స్థానంలో ఉంది” అని అన్నారు బియ్యాల.

 లండన్‌ ఫిలహార్మోనిక్‌ ఆర్కెస్ట్రాలో ఇదివరకే మూడు పాటలకు సంబంధించిన ఆర్కెస్ట్రైజేషన్‌ చేశారు. సినిమా షూటింగ్‌ ప్రారంభానికి ముందే ఈ పనులు పూర్తయ్యాయి. ఆ పాటలు విన్న తర్వాత మిగిలిన పాటలకు సంబంధించిన పనులను బెడపెస్ట్ సింఫనీలో  చేస్తే అంతే గొప్ప క్వాలిటీ వస్తుందని సంగీత దర్శకుడు, దర్శకుడు అనుకున్నారు.

బుడెపెస్ట్ లోని టామ్‌ టామ్‌ స్టూడియోలో రికార్డింగ్‌ జరిగింది. బుడపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రాను లస్‌జ్లో కోవాక్స్ కండక్ట్ చేశారు.

‘ఇళయరాజాగారు మా కోసం చాలా సమయం వెచ్చించారు. ఈ ప్రాజెక్ట్ మీద ఆయన పెట్టిన శ్రద్ధ చూసి చాలా ఆనందంగా అనిపించింది” అని బియ్యాల చెప్పారు.

విద్యా వ్యవస్థ, తల్లిదండ్రులు పిల్లలపై పెడుతున్న ప్రెజర్‌, నిర్విరామంగా సాగుతున్న చదువుకునే గంటలు వంటివాటిని ప్రస్తావించే చిత్రమిది. కళలకు, ఇతర వ్యాపకాలకు అసలు టైమ్‌ లేకుండా చేసి ఇంజనీర్లు, డాక్టర్లుగా మార్చడానికి విద్యార్థులను ఎలా రుబ్బుతున్నారో చెప్పే చిత్రమిది.

శ్రియా శరణ్‌, శర్మన్‌ జోషి, షాన్‌, ప్రకాష్‌ రాజ్‌, సుహాసిని మూలే, బెంజమిన్‌ గిలాని, గ్రేసీ గోస్వామి, ఓజు బరువా కీలక పాత్రల్లో నటించారు. ఏస్‌ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన కిరణ్‌ డియోహాన్స్ కెమెరామేన్‌గా పనిచేశారు.

టొరెంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సెప్టెంబర్‌ 12, 18న ఇండస్ట్రీ / మార్కెటింగ్‌ సెక్షన్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తారు.

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

18 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago