Categories: న్యూస్

‘బనారస్’ నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల

కర్ణాటక శాసనసభకు నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికైన జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ బనారస్‌తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ నిర్మిస్తున్న ఈ సినిమా గణేశ చతుర్థి సందర్భంగా విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు.

నవంబర్ 4వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో  ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం  విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో జైద్ ఖాన్ , సోనాల్ మోంటెరో చూడముచ్చటగా ఉన్నారు. ఇదే పోస్టర్ లో పడవ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్న ఈ జంటని గమనించవచ్చు.

జైద్ ఖాన్, అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పొందాడు. తన సినిమా రంగ ప్రవేశానికి ముందు నటుడిగా అన్ని నైపుణ్యాలను నేర్చుకుంటాడు. బనారస్‌ని చిత్రాన్ని ఖరారు చేయడానికి ముందు జైద్  చాలా స్క్రిప్ట్‌లను విన్నాడు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ప్రమోషన్స్ లో మరింత దూకుడు పెంచబోతుంది చిత్ర యూనిట్.

ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, అద్వైత గురుమూర్తి డీవోపీగా,  కెఎం ప్రకాష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.  

తారాగణం: జైద్ ఖాన్, సోనాల్ మాంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్నా రాజ్, బర్కత్ అలీ  తదితరులు

సాంకేతిక విభాగం
రచన,  దర్శకత్వం: జయతీర్థ
నిర్మాత: తిలకరాజ్ బల్లాల్
బ్యానర్: ఎన్ కె ప్రొడక్షన్స్
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ: అద్వైత గురుమూర్తి
యాక్షన్: ఎ వుయి, డిఫరెంట్ డానీ
డైలాగ్స్: రఘు నిడువల్లి
లిరిక్స్ : డా.వి.నాగేంద్రప్రసాద్
ఎడిటర్: కె ఎం ప్రకాష్
ఆర్ట్: అరుణ్ సాగర్, శీను
కొరియోగ్రాఫర్: జయతీర్థ, ఎ హర్ష
పోస్ట్ సూపర్‌వైజర్ – రోహిత్ చిక్‌మగళూరు
కాస్ట్యూమ్: రష్మీ, పుట్టరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వైబి రెడ్డి
ప్రొడక్షన్ కంట్రోలర్: చరణ్ సువర్ణ, జాకీ గౌడ
పబ్లిసిటీ డిజైన్: అశ్విన్ రమేష్
పీఆర్వో : వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago