Categories: న్యూస్

‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ సింగిల్ థార్ మార్ పాట విడుదల

ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి మెగా మాస్ జాతర సృష్టించిన గాడ్ ఫాదర్ ‘థార్ మార్’ సాంగ్ ప్రోమో మెగా డ్యాన్స్ నంబర్‌పై భారీ అంచనాలను నెలకొల్పింది. ఇద్దరు మెగాస్టార్‌లు తమదైన స్టైల్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేయడం అభిమానులకు కన్నుల పండగలా మారింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న థార్ మార్ పూర్తి పాట తెలుగు, హిందీ భాషల్లో తాజాగా విడుదలైయింది. ఈ పాట నిజంగా చిరంజీవి, సల్మాన్ ఖాన్ స్టార్‌డమ్‌ను గ్లోరిఫై చేయడంతో పాటు చూడటానికి విజువల్ ట్రీట్‌గా వుంది.

ఈ మెగా మాస్ ఫీస్ట్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ మాస్ హుక్ స్టెప్ వేయడం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ పాటకు తమన్ స్కోర్ చేసిన ఫంకీ బీట్‌ మళ్ళీమళ్ళీ వినాలనిపించే మెగా డ్యాన్స్ నెంబర్ గా ఆకట్టుకుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ వీడియోలో చిరంజీవి తన ముఖం మీద చేయి వేసుకుని స్టైలిష్ ఎంట్రీ ఇవ్వగా, సల్మాన్ తన గోళ్లు కొరుకుతూ మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు మెగాస్టార్లు నల్లటి దుస్తులను ధరించి, బ్లాక్ షేడ్స్‌లో అదరగొట్టారు.

శ్రేయా ఘోషల్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేసి ఈ ఫుట్-ట్యాపింగ్ నంబర్‌కు అదనపు ఆకర్షణ జోడించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం ఆకట్టుకుంది. ఈ వీడియోలో చిరంజీవి, సల్మాన్ ఖాన్, ప్రభుదేవా, చిత్ర బృందం సరదాగా షూటింగ్ చేస్తున్న విజువల్స్ కూడా వున్నాయి.

గాడ్ ఫాదర్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని ముఖ్య తారాగణం.

కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్.

గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాతలు: ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్
సమర్పణ: కొణిదెల సురేఖ
బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్
సంగీతం: ఎస్ ఎస్ థమన్
డీవోపీ: నీరవ్ షా
ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

8 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago